‘ఆనందర్ కుమార్ సూపర్ 30’పై ఫ్రెంచ్ డైరెక్టర్ సినిమా
పాట్నా: పేద విద్యార్థులకు బంగారు బాట చూపుతున్న 'సూపర్ 30' విజయాలపై ఓ ఫ్రెంచ్ డైరెక్టర్ సినిమా తీశారు. బీహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్ అనే గణిత అధ్యాపకుడు 2002లో ప్రారంభించిన సూపర్ 30 సంస్థ దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుంది.
ఆయన తరగతిలో ఉండే 30 మంది విద్యార్థుల్లో 25మంది ఐఐటీ ప్రవేశాలకు ఎంపికవడం ఆనంద్‌కుమార్ బోధన గొప్పతనమే. దీనిపై ఫ్రెంచ్ డైరెక్టర్ పాస్కల్ ప్లిసన్ స్పందించి సినిమా తీశారు.

'ది బిగ్ డే' పేరుతో 90నిమిషాల నిడివితో ఈ సినిమా నిర్మించారు. వచ్చే నెల(ఆగస్టు)లో దీనిని ఫ్రాన్స్‌లో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో పెట్టినట్లు ఆయన తెలిపారు.
సూపర్ 30లో చదువుకున్న నలుగురు విద్యార్థుల విజయగాథలను కూడా ఈ సినిమాలో తెరకెక్కించారు. కాగా, ఈ చిత్రం విడుదల సందర్భంగా ఆనంద్‌కుమార్‌ను కుటుంబసమేతంగా ఫ్రాన్స్‌కి ఆహ్వానించారు దర్శకులు పాస్కల్.


Click it and Unblock the Notifications











