Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తెలుగు సినీ పరిశ్రమ గుంటూరుకు తరలివెళ్తుందా?
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ గుంటూరుకు తరలి వెలుతుందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ సినీనటుడు అలీ. ఇటీవల గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ త్వరలోనే సినీ పరిశ్రమ గుంటూరుకు తరలిరానుందని తెలిపారు. సినిమా షూటింగులకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అలీ మాటలు అలా ఉంటే..ఎక్కువ సౌకర్యాలు ఉన్నందున పరిశ్రమ ఎక్కడీకి తరలి పోదని కొందరు ఇండస్ట్రీ బిగ్ షాట్స్ అంటున్నారు. అయితే ఎక్కడ రాయితీలు, సబ్సిడీలు ఇస్తే అక్కడకు పరిశ్రమ వెళ్లి తీరుతుందని బడా నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు లాంటి వారు అంటున్నారు.

అప్పట్లో కొందరు వైజాగ్ ప్రాంతానికి సినీ పరిశ్రమ వస్తుందని అంచనాలు వేసారు. కొందరు అక్కడ భూములు కొనుగోలు చేసారు కూడా. అయితే ఆ మధ్య వచ్చిన తుఫానుతో అక్కడ సినీ పరిశ్రమ నెల కొల్పడం కష్ట సాధ్యమని తేలిపోయింది. తరచూ తుఫాన్ల బెడద ఉంటుంది కాబట్టి చాలా మంది సుముఖత చూపడం లేదు. అయితే హైదరాబాద్ లో సొంత స్టూడియోలు కలిగిన నాగార్జున, సురేష్ బాబు లాంటి వారు పరిశ్రమ ఇక్కడే స్థిరంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్...పరిశ్రమ ఇక్కడి నుండి తరలి పోకుండా ప్లాన్ చేస్తున్నారు. హైదారాబాద్ నగర శివారు ప్రాంతమైన రాచకొండ ప్రాంతంలో ఫిల్మ్ సిటీని నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు.