twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దళితులపై తమ్మారెడ్డి ఫైర్.. మంచి చిత్రాన్ని ఆదరించరా అంటూ అసహనం

    |

    కుల వివక్షపై సినీ విమర్శనాస్త్రం ఎక్కువపెడుతూ వెండితెరను తాకిన తాజా చిత్రం పలాస 1978. మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే మేధావుల ప్రశంసలు అందుకొన్న ఈ సినిమాపై సగటు ప్రేక్షకుడు పెద్దగా స్పందించడం లేదనే విషయాన్ని కలెక్షన్లు వెల్లడిస్తున్నాయి. తాజాగా జరిగిన థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఏమన్నారంటే..

    Recommended Video

    Tammareddy Bharadwaja Controversial Comments In Palasa 1978 Success Meet || Filmibeat Telugu
    బాక్సాఫీస్ వద్ద పలాస 1978 చిత్రం

    బాక్సాఫీస్ వద్ద పలాస 1978 చిత్రం

    పలాస 1978 చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. దళితవాదంతో నిర్మించిన ఈ చిత్రానికి ఆ వర్గం నుంచి మద్దతు పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. దళిత సమస్యలను, వారికి జరిగిన అన్యాయాన్ని తెర మీద కళ్లకు కట్టినట్టు చూపించినప్పటికీ వారు సినిమాను పట్టించకపోవడంపై ప్రముఖులు ఆశర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    మంచి సినిమాలు కావాలంటారు..

    మంచి సినిమాలు కావాలంటారు..

    శనివారం జరిగిన థ్యాంక్స్ మీట్‌లో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూలు కావాలి అంటారు.. అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితుల పాత్రలు సినిమాల్లో ఉండవు.. దళిత కథలు సినిమాగా మారవు అంటారు.. కానీ పలాసలో వారి పాత్రలను హీరోలను చేశాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

    చూడకపోతే మీ ఖర్మ

    చూడకపోతే మీ ఖర్మ

    పలాస 1978 చిత్రంలో దళిత సమస్యలను చర్చించాం.. కానీ వారి నుంచే కనీస స్పందన కరువైంది. మీ సినిమాలు మీరు కూడా చూడక పోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే.. మరిన్ని సినిమాలు వస్తాయి.. ఇది నా ఆవేదన.. నా నలభై ఏళ్ల కెరియర్ లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు..కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం..కానీ ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే అని తమ్మారెడ్డి అన్నారు.

    దళితుల సమస్యల నేపథ్యంగా

    దళితుల సమస్యల నేపథ్యంగా

    1970, 80 దశకాల్లో దళితులకు జరిగిన అన్యాయాలు, వారిపై జరిగిన దాడుల నేపథ్యంగా పలాస 1978 మూవీ తెరకెక్కింది. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రచయిత కరుణ కుమార్ ఈ చిత్రాన్ని సగటు ప్రేక్షకుడు ఆలోచింపజేసే విధంగా రూపొందించారు. ఈ సినిమాలో రక్షిత్, నక్షత్ర, తీరువీర్ ప్రధాన పాత్రలను పోషించారు.

    English summary
    Tollywood Film Maker Thammareddy Bharadwaja contraversial comments on Dalits. While speaking Thanks meet of palasa 1978, He says People are not supporting a good movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X