twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాడ్జీలో...నిర్మాత మాగంటి విజయ బాబు మృతి

    By Srikanya
    |

    లలితా మూవీస్ బ్యానవర్ పై 'ఆల్బం', 'ముద్దాయి' అనువాద చిత్రాలను నిర్మించిన మాగంటి విజయబాబు శనివారం ఉదయం గొంతు కాన్సర్‌తో హైదరాబాద్‌ లాడ్జీలో కన్నుమూశారు. విజయవాడకు చెందిన విజయబాబు గత 20 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఈయన రెండేళ్ళుగా గొంతు కాన్సర్ తో భాదపడుతున్నారు. ఇటీవలే వ్యాధి తీవ్రరూపం దాల్చింది. గత నెల 26న జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల కోసం ఆయన హైదరాబాద్ వచ్చి ఆర్పీ రోడ్ లోని మహేష్ లాడ్జీలో బస చేసారు. ఆ రోజు నుంచి రోజూ బయిటకు వెళుతూ ఉండే వారు. శుక్రవారం రాత్రి పదిన్నర గంటలకు పడుకున్న ఆయన శనివారం ఉదటం రూం శుబ్రం చేసే వ్యక్తి వచ్చి తలుపు కొట్టినా తీయలేదు. దీంతో లాడ్జీ సిబ్బంది రూం వెనకవైపు ఉన్న పోలీసులకు, వారి ద్వారా సినీ వర్గాలకు చేరింది. వారు వచ్చాక తలుపులు బద్దలు కొట్టి లోపలకి వెళ్లారు. విజయబాబుకి గొంతు క్యాన్సర్ తో పాటు గుండే పోటు కూడా వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే బ్లాక్ మార్కెట్ సినిమాకు ఫైనాన్సియర్ గా వ్యవహించారు. చాలా సినిమాలకు పంపిణీదారుడిగా కూడా ఉన్నారు. 53 ఏళ్ల వయసు కలిగిన విజయ బాబుకి ఇంకా వివాహం కాలేదు. తెలుగు నిర్మాతలమండలి, ఫిలిం ఛాంబరు ఆయన మృతికి ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.ధట్స్ తెలుగు కూడా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X