సౌండ్ ఎఫెక్ట్స్ దాము ఇక లేరు
చిన్న వయసులోనే సౌండ్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన దాము కుమార్ (35) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై యశోద ఆసుపత్రిలో సోమవారం ఉదయం 10గంటలకు కన్నుమూసారు. ఆయన వయసు 35సంరాలు, అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భౌతిక కాయానికి మంగళవారం చెన్నైలో అంత్యక్రియలు జరిపారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
'శివ','పెదరాయుడు','క్షణక్షణం', 'నిన్నే పెళ్ళాడతా', 'ఆది', 'శివమణి', 'ఆంధ్రావాలా', 'పెళ్లైన కొత్తలో' వంటి అనేక చిత్రాలకు దాము సౌండ్ ఎఫెక్ట్స్‌ను సమకూర్చారు.ఆయన చివరిగా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన చిత్రం శశిరేఖా పరిణయం'. తెలుగు సినిమా రంగానికి విశేష సేవలను అందించిన దాము కుమార్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని, ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. దట్స్ తెలుగు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తోంది.


Click it and Unblock the Notifications











