రాక్షసులకు దయ ఉండదు: శ్రీలంక విషాదంపై సినీ స్టార్ల స్పందన
ఈస్టర్ పండగ సందర్భంగా శ్రీలంకలో అల్లకల్లోలం సృష్టించేందుకు మూడు చర్చిలు, మూడు ఫైవ్ స్టార్ హోటల్స్‌ను లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు బాంబుపేలుళ్లకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 140 నుంచి 150 పౌరులు మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. 400 మంది క్షతగాత్రులయ్యారు.
శ్రీలంక లోకల్ టైమ్ ప్రకారం ఉదయం 8.45 గంటలకు ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ మారణహోమానికి పాల్పడింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే అని అనుమానిస్తున్నారు. విషాద ఘటనపై పలువురు భారతీయ సినీ ప్రముఖులు స్పందించారు.
రాక్షసులకు దయ ఉండదు
‘ఈస్టర్ ఆదివారం విషాదంగా మారిపోయింది. రాక్షసులకు దయ అనేది ఉండదు. కుటుంబాలపై, పిల్లలపై దాడులకు తెగబడ్డారు.' అని సిద్దార్థ్ ట్వీట్ చేశారు.
రాధిక శరత్ కుమార్
‘‘ఓ మై గాడ్. కొలంబోలోని సిన్నమోన్ హోటల్ నుంచి నేను బయటికి వచ్చాక ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. షాకయ్యాను'' అని ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రాధిక శరత్ కుమార్ అన్నారు.
షాకింగ్, బాధాకరం
‘శ్రీలంక బాంబ్ బ్లాస్ట్ గురించి విని షాయ్యాను. ఇది చాలా బాధాకరం. ఈ సమయంలో శ్రీలంక ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాను.' అని సౌందర్య రజనీకాంత్ ట్వీట్ చేశారు.
ప్రకాష్ రాజ్
‘‘శ్రీలంకలో ప్రజలు ప్రార్థనలు చేస్తుండగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఇది మెజారిటేరియనిజం(మెజారిటీ వర్గం పొలిటికల ఫిలాసఫీ) వికృత చర్య. ఇది మానవత్వాన్ని హరించి వేస్తుంది. ప్రియమైన పౌరులారా దీని గురించి మనం తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. దురభిమానం ప్రదర్శించే ఎవరినైనా సహించడానికి వీల్లేదు. వారి మూలంగానే నేటి సమాజంలో చీలికలు ఏర్పడుతున్నాయి. వారితో జాగ్రత్తగా ఉండాలి'' అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
విశాల్
‘‘శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగాయని తెలిసి చాలా బాధపడ్డాను. శ్రీలంక ప్రజల క్షేమంగా ఉండాలి. వారికి దేవుడు మనోదైర్యం ఇవ్వాలి.'' అని విశాల్ ట్వీట్ చేశారు.
సాయి ధరమ్ తేజ్
శ్రీలంక పేలుళ్లపై తెలుగు నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ... ‘ఇది చాలా విషాదకర సంఘటన. మృతుల కుటుంబాలకు మనో ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
సుధీర్ బాబు
‘‘ఈస్టర్ పండగ రోజు ఇలాంటి భయానక సంఘటన జరుగడం నన్ను ఎంతో బాధించింది. మానవత్వం లేని రాక్షసులే ఇలాంటి ఘటనలకు పాల్పడతారు. నా హృదయం ముక్కలైంది.'' అని సుధీర్ బాబు ట్వీట్ చేశారు.
జాక్వెలిన్
‘‘శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరగడం నిజంగా బాధాకరం. హింస అనేది ఓ చెయిన్ రియాక్షన్‌లా జరుగుతోంది. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.'' అని బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











