»   » కుల, మతాలకు అతీతంగా పెళ్లాడిన సినీతారలు (ఫోటో ఫీచర్)

కుల, మతాలకు అతీతంగా పెళ్లాడిన సినీతారలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటికీ మన సమాజంలో కులం, మతం ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచం ఇంత అభివృద్ధి చెందుతున్నా.....కులం కుళ్లు, మత మౌఢ్యం మన సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇక కులం, మతానికి అతీతంగా పెళ్లి చేసుకుంటే ఇప్పటికీ కొన్ని చోట్లు పరువు హత్యలు జరుగుతున్నయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కుల మతాలను పట్టించుకోవద్దు, మనుషులంతా ఒక్కటే...అంటూ పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా మార్పు మాత్రం కనిపించడం లేదు. అయితే ఎడ్యుకేషన్ పీపుల్‌లో ఇప్పుడిప్పుడే ఈ మార్పుకు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా సినిమా తారలు కులం, మతాలకు అతీతంగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ఆదర్శంగా నిలుస్తూ ఈ మార్పులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

సినిమాల వల్ల సమాజంలోకి కొంత చెడు వ్యాప్తి చెందుతుందన్నది ఎంత వాస్తవమో.....కులం, మతాలకు అతీతంగా ముందుకు సాగుతున్న కొందరు సినిమా తారల వల్ల సమాజంలోకి కొంత మంచి కూడా వ్యాప్తి చెంతున్నదీ అంతే వాస్తవం. కుల మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వారిలో షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి లాంటి టాప్ స్టార్లు ఈ లిస్టులో ఉన్నారు.

మన తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారు కూడా కులాలకు అతీతంగా వివాహాలు చేసుకున్నారు. ఈ రోజు ఫోటో ఫీచర్లో కులం, మతాలకు అతీతంగా పెళ్లాడిన సినిమా తారల గురించి తెలుసుకుందాం....

షారుక్ ఖాన్, గౌరీ

షారుక్ ఖాన్, గౌరీ

ముస్లిం మతానికి చెందిన షారుక్ ఖాన్ హిందూ మతానికి చెందిన గౌరీని ప్రేమించి పెళ్లాడారు.

సునీల్ శెట్టి

సునీల్ శెట్టి

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముస్లిం మతానికి చెందిన మానా కడారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

సంజయ్-మాన్యత

సంజయ్-మాన్యత

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మాన్యతా దత్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇది మూడో వివాహమే. మన్యత ముస్లిం మతానికి చెందిన వ్యక్తి. ఆమె అసలు పేరు దిల్హాజ్ షేక్.

సునిల్ దత్

సునిల్ దత్

ముస్లిం మతానికి చెందిన నర్గీస్, హిందూ మతానికి చెందిన సునీల్ దత్‌ పెళ్లాడారు. పెళ్లి తర్వాత నర్గీస్ తన పేరును నిర్మలా దత్‌గా మార్చుకుంది.

రామ్ చరణ్-ఉపాసన

రామ్ చరణ్-ఉపాసన

తెలుగు నటుడు రామ్ చరణ్ కులానికి అతీతంగా ఉపాసనను పెళ్లాడారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కులం పట్టింపు లేకుండా రేణుదేశాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు కూడా కులం పట్టింపు లేకుండా నమ్రత శిరోద్కర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

తెలుగు హీరో అల్లు అర్జున్ కూడా కులానికి అతీతంగా స్నేహారెడ్డిని పెళ్లాడారు.

సైఫ్-కరీనా

సైఫ్-కరీనా

ముస్లిం మతానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ హిందూ మతానికి చెందిన కరీనా కపూర్‌ను పెళ్లాడారు.

షర్మిలా ఠాగూర్

షర్మిలా ఠాగూర్

నటి షర్మిలా ఠాగూర్ ముస్లిం మతానికి చెందిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని 1969లో పెళ్లాడారు. ఆ తర్వాత ఆమె ముస్లిం మతంలోకి మారి తన పేరును ఆయేషా సుల్తానా ఖాన్‌గా పేర్కొన్నారు.

నసీరుద్దీన్ షా

నసీరుద్దీన్ షా

ముస్లిం మతానికి చెందిన నసీరుద్దీన్ షా మొదటి భార్య మనారా సిక్రితో విడిపోయిన తర్వాత హిందూ మతానికి చెందిన రత్నా పతాక్‌ను రెండో వివాహం చేసుకున్నారు.

పరా ఖాన్, శిరీష్ కుందర్

పరా ఖాన్, శిరీష్ కుందర్

బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్...తన కంటే 8 ఏళ్లు చిన్నవాడైన, ఇతర మతానికి చెందిన శిరీష్ కుందర్‌ను పెళ్లాడారు.

సంగీతా బిజ్లానీ

సంగీతా బిజ్లానీ

హిందూ మతానికి చెందిన మోడల్, నటి సంగీత బిజిలానీ....ముస్లిం మతానికి చెందిన క్రికెటర్ అజారుద్దీన్‌ను పెళ్లాడింది.

అమృత అరోరా

అమృత అరోరా

క్రిస్టియన్ మతాన్ని ఫాలో అయ్యే అమృత అరోరా...ముస్లిం మతానికి చెందిన షకీల్‌ను పెళ్లాడింది. ముంబైలోని బాంద్రా చర్చిలో వీరి వివాహం జరిగింది.

అర్షద్ వర్షి

అర్షద్ వర్షి

బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షి టీవీ యాంకర్ మారియా గోరెట్టిని పెళ్లాడారు. మారియా క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కాగా, అర్షన్ ఇస్లాంను ఫాలో అవుతున్నారు.

కబీర్ ఖాన్

కబీర్ ఖాన్

దర్శకుడు కబీర్ ఖాన్ యాంకర్ మిని మాథుర్‌ను పెళ్లాడారు. కబీర్ ఖాన్ ముస్లిం కాగా, మిని మాథూర్ హిందూ.

అనురాగ్ కశ్యప్

అనురాగ్ కశ్యప్

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఫ్రెంచ్ సంతతి భామ కల్కి కొచ్లిన్‌ను పెళ్లాడారు.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కిరణ్ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఫర్హాన్ అక్తర్

ఫర్హాన్ అక్తర్

పర్హాన్ అక్తర్ అధునా బబానిని పెళ్లాడారు. పర్హాన్ అక్తర్ ముస్లింకాగా, అధునా బబాని బెంగాళీ హిందు.

మలైకా అరోరా

మలైకా అరోరా

బాలీవుడ్ నటి మలైకా అరోరా....అర్బాజ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది.

రితేష్ దేశ్ ముఖ్

రితేష్ దేశ్ ముఖ్

హిందూ మతానికి చెందిన రితేష్ దేశ్ ముఖ్, కిస్టియన్ మతానికి చెందిన జెనీలియా ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే.

విధు దారా సింగ్

విధు దారా సింగ్

బాలీవుడ్ నటుడు విధు ధారా సింగ్ తన మొదటి భార్య ఫరాహ్ నాజ్‌తో విడిపోయిన తర్వాత...రష్యన్ మోడల్ దినా ఉమరోవాను పెళ్లాడారు.

English summary
Remember Shah Rukh Khan's Diwale Dulhania Le Jayenge, where no one could stop Raj and Simran from being together? Most romantic Bollywood movies are like fairy tale romances. It is reported that Kareena Kapoor was so in love with this movie that she would watch it over and over and even got into a petty spat with Zoya Akhtar over the movie being the most romantic film made in the history of Indian Cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu