ఎన్నికల నిబంధనలతో హీరోయిన్స్ కి దెబ్బ

By Srikanya

Film Stars not participating in This election
ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బాలీవుడ్‌ నటుల సందడి కనిపించడం లేదు. తారలతో ప్రచారం చేయించడానికి భాజపా, కాంగ్రెస్‌ రెండు పార్టీలు వీడ్కోలు చెప్పాయి. గతంలో పార్టీల కోసం ప్రచారం చేయడంలో ఖుష్బూ, సునీల్‌షెట్టి, మహిమాచౌదరి, గోవిందా, గుల్షన్‌ గ్రోవర్‌, హేమమాలిని, ధర్మేంద్ర, చుంకీ పాండే, రాజేష్‌ ఖన్నా, రీనా రాయ్‌ తదితరులు కీలకపాత్ర వహించేవారు. ఈసీ ఎన్నికల వ్యయంపై కఠినమైన చర్యలు తీసుకోవటమే దీనికి కారణం.

ఎన్నికల ప్రచారానికి వచ్చిన నటీనటులపై పార్టీలు చేసే ఖర్చుని కూడా ఆయా పార్టీల ఎన్నికల వ్యయం కింద పరిగణిస్తామని ఎన్నికల సంఘం చెప్పటంతో సినీ తారలతో ప్రచారానికి నేతలు స్వస్తి పలికారు. నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో తారలతో ప్రచారం చేయించకపోవడం ఇదే మొదటిసారి. ప్రతీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కింద రూ. 14 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. బాలీవుడ్‌ తారలతో ప్రచారం చేయడానికి అవరోధం ఏర్పడటంతో కాంగ్రెస్‌, భాజపాలు తమ పార్టీలకు చెందిన దిగ్గజాలతో ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు.

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, అజయ్‌మాకెన్‌, సచిన్‌పైలట్‌, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, సుశీల్‌ కుమార్‌ షిండే, రాజ్‌బబ్బర్‌ తదితరులు కాంగ్రెస్‌ తరపున స్టార్‌ ప్రచారకులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల చివరి నుంచి నరేంద్ర మోడీ, ఎల్‌.కె.అద్వానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ, నితిన్‌ గడ్కరీ, మురళీ మనోహర్‌ జోషి తదితరులు నగరంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X