twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2019 ఎన్నికల్లో సినీ స్టార్లు... ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?

    |

    Recommended Video

    List Of Film Stars Who Won, Who Lost In 2019 Elections || Filmibeat Telugu

    దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి 350కి పైగా స్థానాల్లో గెలుపొంది మరోసారి విజయ ఢంకా మ్రోగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ క్లీన్ స్వీప్ చేసి అధికారం చేజిక్కించుకుంది. సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు స్టార్లు బరిలో నిలిచారు. వీరిలో కొందరు ప్రజల మద్దతుతో విజయం వైపు అడుగులు వేయగా... మరికొందరు ఘోర పరాజయం పాలయ్యారు.

    జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఏపీ అసెంబ్లీకి పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలవ్వడం గమనార్హం. ఆయన సోదరుడు నాగబాబు కూడా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

    లాగిపెట్టి ముఖంపై కొట్టారు.. ప్రకాశ్ రాజ్.. విలక్షణ నటుడికి చేదు అనుభవంలాగిపెట్టి ముఖంపై కొట్టారు.. ప్రకాశ్ రాజ్.. విలక్షణ నటుడికి చేదు అనుభవం

    నాగబాబు ఓటమి

    నాగబాబు ఓటమి

    నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాగబాబు వైసీపీ అభ్యర్థి కనమూరు రఘురామకృష్ణ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు.

    పవన్ కళ్యాణ్ ఓటమి

    పవన్ కళ్యాణ్ ఓటమి

    భీమవరంతో పాటు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. గాజువాకలో తిప్పల నాగిరెడ్డి(వైసీపీ) చేతిలో ఓటమి పాలయ్యారు.

    రోజా గెలుపు

    రోజా గెలుపు

    నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటి రోజా... టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ మీద విజయం సాధించారు.

    హేమా మాలిని గెలుపు

    హేమా మాలిని గెలుపు

    ఉత్తరప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసిన బాలీవుడ్ నటి హేమా మాలిని విజయం సాధించారు.

    జయప్రద ఓటమి

    జయప్రద ఓటమి

    ఉత్తరప్రదేశ్‍‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి బరిలో దిగిన నటి జయప్రద.... సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు.

    కిరణ్ ఖేర్ గెలుపు దిశగా

    కిరణ్ ఖేర్ గెలుపు దిశగా

    చండీఘర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ నుంచి బరిలో ఉన్న బాలీవుడ్ నటి కిరణ్ ఖేర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ భన్సల్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ఆయన గెలిచే అవకాశం కనిపించడం లేదు.

    రవి కిషన్ గెలుపు

    రవి కిషన్ గెలుపు

    బాలీవుడ్ నటుడు, రేసు గుర్రం మూవీ విలన్ రవి కిషన్... ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ మీద 1 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో రవికిషన్ గెలుపు ఖాయమని తేలిపోయింది.

    సన్నీ డియోల్ గెలుపు

    సన్నీ డియోల్ గెలుపు

    పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్... లక్ష ఓట్ల మెజారిటీ దిశగా సాగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ జకార్ మీద గెలుపు ఖాయం చేసుకున్నారు.

    ఊర్మిలా మండోద్కర్ ఓటమి

    ఊర్మిలా మండోద్కర్ ఓటమి

    కాంగ్రెస్ పార్టీ తరుపున ముంబై నార్త్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలీవుడ్ నటి ఊర్మిళా మండోద్కర్ బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓటమి పాలయ్యారు.

    శతృఘ్న సిన్హా ఓటమి

    శతృఘ్న సిన్హా ఓటమి

    కాంగ్రెస్ పార్టీ నుంచి పాట్నా సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా...బీజేపీ అభ్యర్థి రవి శంకర్ ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు.

    సుమలత గెలుపు

    సుమలత గెలుపు

    కర్నాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సినీ నటి సుమలత... యువ కన్నడ నటుడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడపై విజయం సాధించారు.

    పూనమ్ సిన్హా ఓటమి

    పూనమ్ సిన్హా ఓటమి

    లక్నో నుంచి సమాజ్ వాదీ పార్టీ నుంచి బరిలో దిగిన 69 ఏళ్ల బాలీవుడ్ నటి పూనమ్ సిన్హా.... బీజేపీ అభ్యర్థి రాజ్‌నాథ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

    ప్రకాష్ రాజ్ ఓటమి

    ప్రకాష్ రాజ్ ఓటమి

    బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్ ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పిసి మోహన్ విజయం సాధించారు.

    English summary
    Film Stars Who win, Who loss in 2019 Lok Sabha elections. There are veterans like Shatrughan Sinha, Hema Malini, Kirron Kher.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X