మీ చావే మా వ్యాపారం

By Staff

Mumbai Attacks
సుమారు 200 మందిని బలితీసుకున్న ముంబై మారణకాండను క్యాష్‌ చేసుకునేందుకు సినీ నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీనిపై సినిమా తీసేందుకు తహతహలాడుతున్నారు. దీనిపై సినిమా పేర్లు నమోదు కోసం ఇప్పటికే సుమారు 25 ప్రతిపాదనలు అందాయని ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ప్రొసీజర్స్‌ అసోసియేషన్‌(ఐఎంపీపీఏ) ఉపాధ్యక్షురాలు సుష్మా శిరోమణి తెలిపారు.

బి.సుభాశ్‌, ఆకాశ్‌ సెహగల్‌, విజయ్‌ వర్మ తదితరులు ఐఎంపీపీఏ నుంచి ఆ పేర్ల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారని ఆమె తెలిపారు. కనీసం మరో నెల వరకూ వీటిని ఆమోదించబోమని చెప్పారు. 'ఈ విషాధాన్ని వారు వాణిజ్య పరంగా సొమ్ము చేసుకుంటారో లేక సున్నిమైన సినిమా తీస్తారో పేరు నమోదు సందర్భంలో మాకు తెలియదు.సినిమాను ఎలా ప్రజెంట్‌ చేస్తారనేది పూర్తిగా నిర్మాతల చేతుల్లోనే ఉంది' అని అన్నారు.

అయితే వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తీయడం కొత్త విషయమేమీ కాదని చెప్పారు. 'ఈ ఏడాదే ముంబై మేరి జాన్‌, ఎ వెడ్నస్ డే, షూట్‌ ఆన్‌ సైట్‌ వంటి సినిమాలు ఉన్నాయి. వీటికి ముందే ఫర్జానియా, బ్లాక్‌ ఫ్రైడే వంటి సినిమాలు' అని అన్నారు. ఇక ఈ విషయంపై కొంతమంది ఇప్పటికే కోర్టు కెళ్ళతామని అంటున్నారు. మా వాళ్ళు చనిపోతే మీరు వాటిపై వ్యాపారం చేస్తారా అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X