సినీ రచయిత్రి అచ్యుతవల్లి మృతి
హైదరాబాద్: 'ఇదెక్కడి న్యాయం' సినిమా రచయిత్రి ఇరగంటి వెంకట శేష అచ్యుతవల్లి (72) ఆదివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. నిన్న(సోమవారం) అంత్యక్రియలు జరిగాయి. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించారు. ఆ సినిమాకు ఉత్తమ సినీ రచయిత్రిగా బంగారు నంది అవార్డు పొందారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు గ్రామానికి(తాడేపల్లి గూడెం ప్రక్కన) ఆమె స్వగ్రామం. తన జీవితకాలంలో ఆమె పాఠాకాదరణ పొందన 'అమ్మ మనసు' వంటి 18 నవలలు రచించారు. అంతేకాక సంగీతం లో 'రాజ్యలక్ష్మి' అవార్డును సైతం పొందారు. సాహిత్యంలో ఆంధ్ర సాహిత్య సరస్వతి బిరుదు పొందడమే కాకుండా ఆంధ్ర సాహిత్య సభ వారు స్వర్ణ కంకణం తొడిగి సత్కరించారు. వల్లీ మృతి పట్ల సాహితీవేత్తలు, ప్రజా ప్రతినిధులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











