»   » ఫిల్మ్ ఫేర్ విన్నర్స్: మహేష్ బాబు, అనుష్క, రాజమౌళి (విన్నర్స్ పూర్తి లిస్ట్)

ఫిల్మ్ ఫేర్ విన్నర్స్: మహేష్ బాబు, అనుష్క, రాజమౌళి (విన్నర్స్ పూర్తి లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫిల్మ్ ఫేర్ సౌత్ 2016 అవార్డ్స్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ గ్రాండ్ గా జరిగింది. సినీ తారల తలుకు బెలుకులతో అవార్డుల కార్యక్రమం మరింత కలర్ ఫుల్ గా మారింది.

ఈ వేడుకకు రాహుల్ రవీంద్రన్, చిన్మయి లు దంపతులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు సినిమాలకు సంబంధించి శ్రీమంతుడు చిత్రానికి గాను మహేష్ బాబు ఉత్తమ కథానాయకుడి అవార్డు అందుకోగా, రుద్రమదేవి చిత్రంలో ప్రదర్శనకు గాను అనుష్క ఉత్తమ కథానాయిక అవార్డు సొంతం చేసుకుంది. మోహన్ బాబు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో దాసరి, చిరంజీవి, మోహన్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా, అఖిల్, మంచు విష్ణు తదితర టాప్ స్టార్స్ హాజరయ్యారు. ఎమి జాక్సన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత సుభాస్, కేథరిన్ తదితరులు స్టేజీ ఫర్ఫామెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Filmfare Awards South 2016: Mahesh Babu wins Best Actor for Srimanthudu

బెస్ట్ యాక్టర్ (మేల్)- మహేష్ బాబు (శ్రీమంతుడు)
బెస్ట్ యాక్టర్ (ఫీమేల్)- అనుష్క (రుద్రమదేవి)
బెస్ట్ డైరెక్టర్ -రాజమౌళి (బాహుబలి ది బిగినింగ్)
బెస్ట్ ఫిల్మ్ - బాహుబలి ది బిగినింగ్
క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ (మేల్)- నాని (భలేభలే మగాడివోయ్)
క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ (ఫీమేల్)- నిత్యా మీనన్ (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు)
బెస్ట్ డెబ్యూట్ (మేల్)- అఖిల్ (అఖిల్)
బెస్ట్ డెబ్యూట్ (ఫీమేల్)- ప్రజ్ఞ్యా జైస్వాల్ (కంచె)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(మేల్)- అల్లు అర్జున్ (రుద్రమదేవి)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫీమెల్ ) - రమ్యకృష్ణ (బాహుబలి ది బిగినింగ్)
బెస్ట్ లిరికిస్ట్ -సిరివెన్నెల సీతారామ శాస్త్రి (రా ముందడుగు వేద్దామ్ .. -కంచె)
బెస్ట్ సింగర్ (మేల్)- ఎం‌ఎల్‌ఆర్ కార్తికేయన్ (పోరా శ్రీమంతుడా.. -శ్రీమంతుడు)
బెస్ట్ సింగర్ (ఫీమేల్)- గీతా మాధురి (జీవనది.. -బాహుబలి ది బిగినింగ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - దేవి శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - కే‌కే సెంథిల్ కుమార్ (బాహుబలి ది బిగినింగ్)
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు- మోహన్ బాబు.

English summary
It is Mahesh mania yet again as Prince Mahesh Babu wins the Best Actor (Male) for his work in Srimanthudu at the 63rd Britannia Filmfare Awards South 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu