జూ ఎన్టీఆర్ కి అక్కడా స్థానం లేదా....
ఈసారి సౌత్ సినిమా ఇండస్ట్రీకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రముఖ సినిమా మ్యాగజైన్ ఫిలింఫేర్ తమ తాజా సంచికను ప్రచురించింది. ఈ సంచికలో తెలుగు, తమిళ సినీ రంగాల విశేషాలను, పలు కథనాలను ముద్రించిన ఫిలింఫేర్ 'ఉత్తరాదిన కూడా రాణించగల దక్షిణాది తారలు" అలే కాన్సెప్ట్ తో ఓ ఆర్టికల్ ని ముద్రించడం విశేషం. కాగా బాలీవుడ్ లోనూ చక్రం తిప్పగలరంటూ ఫిలింఫేర్ అభిప్రాయపడ్డ సౌత్ స్టార్స్ లో మహేష్, రామ్ చరణ్, రాణా, రామ్, అల్లు అర్జున్, విక్రమ్, సూర్య అనుష్క, ఇలియానా తదితరులున్నారు. అయితే ఆ లిస్ట్ లో జూ ఎన్టీఆర్ ప్రస్థావనకానీ నందమూరి యంగ్ టైగర్ ప్రాముఖ్యత కానీ ఇవ్వకపోవడం పై ఇండస్ట్రీలో ఇప్పుడు పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆల్ రెడీ ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా పొందిన ఎన్టీఆర్ ని ఆ పత్రిక ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదంటారు.
జూ ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ తేజ్ రాణా రామ్ అల్లు అర్జున్ అనుష్క ఇలియానా jr ntr mahesh babu ram charan teja rana ram allu arjun anushka ileana


Click it and Unblock the Notifications