Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్‌లో నాని రికార్డు.. అలా రవితేజకు కూడా.. విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
సాధారణంగా ఏ రంగంలో అయినా మంచి ప్రదర్శన కనబరిచే వాళ్లకు అవార్డులు ఇస్తుంటారు. సినీ రంగానికి సంబంధించి ఇవి చాలా రకాలే ఉన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రం ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఫిల్మ్‌ఫేర్ ఒకటి. దేశంలోని పలు ఇండస్ట్రీలకు వేరు వేరుగా ఇచ్చే ఈ అవార్డుల వేడుక ఇప్పుడు 69వ వసంతాన్ని జరుపుకుంటోంది. ఇప్పుడు సౌతిండియాలోని సినీ ఇండస్ట్రీలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రకటించి ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఎవరికి వచ్చాయో మీరే చూడండి!
గ్రాండ్‌గా ఫిల్మ్‌ఫేర్ వేడుక
ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అనిపించుకున్న 'ఫిల్మ్‌ఫేర్' 69వ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో దక్షిణాదిలోని పరిశ్రమలకు చెందిన ఎంతో మంది స్టార్లు సందడి చేశారు. మరీ ముఖ్యంగా కొందరు నటీనటులు అదిరిపోయే ప్రదర్శనలు చేసి అలరించారు. దీనికి సందీప్ కిషన్, ఫరియా హోస్టింగ్ చేశారు.

దసరా, బేబి మూవీల హవా
ఫిల్మ్‌ఫేర్ 2024 అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్‌లో ఉన్న 'దసరా', 'బేబి' సినిమాలు హవాను చూపించాయి. ముఖ్యంగా నాని మాస్ సినిమాకు ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు లభించగా.. ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమాకు ఐదు అవార్డులు వచ్చాయి. అలాగే, 'బలగం', 'రంగమార్తాండ' సినిమాలకు కూడా పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి.
ఫిల్మ్‌ఫేర్‌లో నాని రికార్డు
2024 ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా 'దసరా' చిత్రంలోని నటనకు గానూ నేచురల్ స్టార్ నాని ఎంపికయ్యాడు. తద్వారా ఎక్కువ సార్లు ఈ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరోగా లిస్టులో చేరాడు. అంతేకాదు, నాని పరిచయం చేసిన ఇద్దరు దర్శకులు శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న)కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వచ్చింది. దీంతో ఓ రికార్డు నమోదైంది.
ఫిల్మ్‌ఫేర్ విజేతలు.. పూర్తి వివరాలివే
ఉత్తమ చిత్రం: బలగం
ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం)
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న)
ఉత్త చిత్రం (క్రిటిక్స్): బేబి
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబి)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూపలక్ష్మి (బలగం)
ఉత్తమ సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (బేబి)
ఉత్తమ గేయ రచయిత: ఆనంత్ శ్రీరామ్ (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (సార్ - మాస్టారు మాస్టారు)
ఉత్తమ నృత్య దర్శకుడు: ప్రేమ్ రక్షిత్ (దసరా - ధూమ్ ధామ్ దోస్తాన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూరన్ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్ల అవినాష్ (దసరా)


Click it and Unblock the Notifications











