100 మిలియన్ మార్క్ అందుకున్న ఫిల్మీబీట్!
హైదరాబాద్: సినిమా రంగానికి సంబంధించిన విశేషాలను ప్రత్యేకంగా అందించాలనే లక్ష్యంతో స్థాపించబడిన ఫిల్మీబీట్ డాట్ కామ్‌కు పాఠకుల నుండి అనూహ్య ఆదరణ లభిస్తోంది. మొదటి నెల(సెప్టెంబర్) లోనే మా వెబ్ సైట్ 10 కోట్ల (100 మిలియన్) పేజీ వీక్షణల మార్కును అందుకుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. పాఠకుల ఆదరణ వల్లే ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా ఫిల్మీబీట్ పాఠకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

ఫిల్మీబీట్ డాట్ కామ్ గురించి...
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, మళయాలం, కన్నడ....ఇలా ఆరు ప్రాంతీయ భాషల్లో ఫిల్మీబీట్ సీనీ ప్రేమికులకు సేవలు అందిస్తోంది. సినీ వార్తలు, సెలబ్రిటీ గాసిప్స్, ఆడియో ఫంక్షన్స్, ఫోటోలు, వీడియోలతో పాటు హాలీవుడ్, బాలీవుడ్ విశేషాలు కవరేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు పాఠకులకు అందిస్తున్నాము.
పాఠకుల ఆదరణ వల్లే మేము అతి తక్కువ కాలంలో ఈ ఘనత సాధించామని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మమ్మల్ని మరింతగా ఆదరిస్తూ మరింత నాణ్యమైన సేవలు అందజేసేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ పాఠక మహాశయులకు ఫిల్మీబీట్ టీం హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది.


Click it and Unblock the Notifications











