twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కులం, మతం, జాతి ఏమిటని దాసరి ఎప్పుడూ అడగలేదు: ఆర్ నారాయణ మూర్తి

    By Bojja Kumar
    |

    Recommended Video

    దాసరి తో తన అనుభందాన్ని గుర్తు చేసుకున్న ఆర్ నారాయణమూర్తి

    తెలుగు సినిమా పరిశ్రమలో దాసరి నారాయణరావుకు అంత గొప్పపేరు రావడానికి ఆయన ప్రతిభతో పాటు మంచి మనసు కూడా కారణమని విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఫిల్మీబీట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ 'మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో హీరో అయిపోదామని మద్రాసు వెళ్లిపోయాను. వెళ్లగానే వేషాలు ఇస్తారని అనుకున్నాను... కానీ వెళ్లాక తెలిసింది నాలాంటోళ్లు లక్షల మంది ఉన్నారని, అవకాశాల్లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో దాసరి ఎంతో సపోర్టు ఇచ్చారని తెలిపారు.

    దాసరి నారాయణరావు కారణంగానే

    దాసరి నారాయణరావు కారణంగానే

    దాసరి నారాయణరావు తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం వల్లనే తాను సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని నిలదొక్కుకున్నానని, ఆయన తీసిన నేరము శిక్షలో సెకండ్ హీరో పాత్ర ఇచ్చారు. అలా ఆయన ఇచ్చిన సపోర్టుతోనే ఈ స్థాయి వరకు వచ్చానని తెలిపారు.

     నీ కులం, జాతి ఏమిటని దాసరి ఎప్పుడూ అడగలేదు

    నీ కులం, జాతి ఏమిటని దాసరి ఎప్పుడూ అడగలేదు

    నేను మా గురువు దాసరిని కలిసినపుడు మీ కులం ఏమిటి? మీ మతం ఏమిటి? మీ జాతి ఏమిటి? నీ ఊరేంటి? మీ అమ్మా బాబు ఎవరు? అని ఎప్పుడూ అడగలేదు. అది ఆయన గొప్పతనం. మాలాంటి వారికి ఇండస్ట్రీలో ఆయన ఒక అండగా, ఒక భరోసాగా నిలిచారని నారాయణ మూర్తి తెలిపారు.

    లేకనే వేషాలు లేక పోవడంతోనే ఆ నిర్ణయం

    లేకనే వేషాలు లేక పోవడంతోనే ఆ నిర్ణయం

    ఒకానొక సమయంలో హీరో వేషాలు రావడం తగ్గిపోయింది. అప్పటికే ఇండస్ట్రీలో పోటీ ఎక్కువైంది. ఇలాంటి సమయంలో నా భవిష్యత్ ఏమిటి? అనే ఆలోచనలో పడ్డాను. ఇండస్ట్రీ వదిలి ఇంటికి వెళ్లలేను, అలా అని కెరీర్ ముందుకు సాగడం లేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఆ సమయంలోనే ఓ ఆలోచన వచ్చింది. నేను హీరో అవ్వాలంటే నేనే డైరెక్టర్ అవ్వాలి. ఆ సమయంలో మనకు డైరెక్షన్ చాన్స్ ఇచ్చేవారు కూడా లేరు. డైరెక్టర్ అవ్వాలంటే నేనే ప్రొడ్యూసర్ అవ్వాలి అని నిర్ణయిచుకున్నాను... అని ఆర్ నారాయణమూర్తి తెలిపారు.

    స్నేహితుల సహయంతో స్నేహి చిత్ర పిక్సర్స్

    స్నేహితుల సహయంతో స్నేహి చిత్ర పిక్సర్స్

    నేను హీరో, డైరెక్టర్, నిర్మాత అవుదామనుకున్న సమయంలో నా స్నేహితులు డబ్బులు ఏర్పాటు చేశారు. దాంతో స్నేహ చిత్ర పిక్చర్స్ బేనర్ ఏర్పాటు చేసి ‘అర్దరాత్రి స్వతంత్రం' సినిమా చేశాను. అది సంవత్సరం పాటు ఆడి సూపర్ హిట్ అయింది. అదొక అద్భుతమైన సినిమా. అక్కడి నుండి నా ప్రస్తానం హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతోంది.... అని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.

    రామారావు సినిమాలు ప్లాప్ అవ్వాలని...

    రామారావు సినిమాలు ప్లాప్ అవ్వాలని...

    ఫనేను నాగేశ్వరరావు అభిమానిని. బిఏ చదివే సమయంలో నాగేశ్వరావు ఫ్యాన్స్ అంతా సినిమా చూసేందుకు వెళ్లేవారం. రామారావు సినిమాలు ప్లాప్ అవ్వాలని కోరుకునే వారం. ఆరోజల్లో అది పిచ్చి శాడిజం. ఆ వయసులో మాకు తెలియలేదు. అది చాలా తప్పు. ఆ తర్వాత రామారావు గారి సినిమాలు చూసి ఆయన గొప్ప నటన చూసి నా ఆలోచన మార్చుకున్నాను' అని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.

    English summary
    Tollywood Red Films star R Narayana Murthy revealed interesting facts about Dasari Narayana Rao in Filmibeat Special interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X