twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు కావాలని కలలు కన్న ఆ పిల్లవాన్ని నేనే : మిణుగురులు దర్శకుడు అయోధ్య కుమార్ (ఇంటర్వ్యూ)

    ఒక్క సినిమా తోనే ఏడు నందులని టాలీవుడ్ కి బహూకరించిన "మిణుగురులు" సినిమా దర్శకుడు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి తో స్పెషల్ ఇంటర్వ్యూ

    |

    తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు.. తక్కువే...అంత డబ్బు ఖర్చు పెట్టి వెనక్కి వస్తాయో లేదో తెలియని చిత్రాలు చేయటమెందుకని ధైర్యం చేయరు మనోళ్ళు. అయితే అక్కడక్కడా మిణుకుమంటున్నట్లుగా మేం ఉన్నాం అంటూ మిణుగురులు లాంటి సినిమా ఒకటి వస్తుంది... రొడ్దకొట్టుడు పాటలూ, ఎగిరెగిరి దూకే సినిమాని సవాల్ చేస్తుంది. "ఇండియన్ సినిమా కి ఆస్కార్ కావాల్సొచ్చిందా..??" అన్న మాటలని ఎద్దేవాచేస్తూ ఆస్కార్ లైబ్రరీలో చోటు సంపాదించుకోని తెలుగు సినిమా దమ్మునీ, తెలుగు చిత్రాల స్థాయినీ.., ఒక్క అడుగు ముందుకేస్తే అంతర్జాతీయ సినిమాకి మేమేం తక్కువకాదంటూ టాలీవుడ్ మీసం మెలేస్తుంది....

    మరి ఆ మిణుగురులని వెలిగించిన అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి అనే దర్శకుడు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాని నిలబెట్టే ప్రయత్నం ఎలా సాగిందీ., దానిలో కష్టమెంతా, తపన ఎంతా..? విజయం సాధించానా లేదా అన్న అయోమయం లోనే ఖండాలు దాటిన కీర్తి ఆనందమెంతా.... ఇవన్నీ తెలుసుకునే ప్రయత్మ చేసింది ఫిల్మీ బీట్... ఒక్క సినిమా తోనే ఏడు నందులని టాలీవుడ్ కి బహూకరించిన "మిణుగురులు" సినిమా దర్శకుడు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి తో స్పెషల్ ఇంటర్వ్యూ....

    మిణుగురులు మొదలవ్వటానికి ముందు అసలు అయోధ్య కుమార్ అంటే ఎవరు?

    మిణుగురులు మొదలవ్వటానికి ముందు అసలు అయోధ్య కుమార్ అంటే ఎవరు?

    దర్శకుడు కావాలని కలలు కన్న పిల్ల వాడు (నవ్వుతూ) 2002 లో యూఎస్ లో నాలుగేళ్ళ నార్త్ వెస్ట్ ఫిలిం సెంటర్ పోర్ట్ ల్యాండ్ ఆరిగన్, (పోర్ట్ లాండ్ స్టేట్ యూనివర్సిటీలో) నాలుగేళ్ళు చదువుకున్నాను., అక్కడ డిగ్రీ పూర్తవ్వగానే అక్కడే నేషనల్ టీవీ (OPB) ఆరిగన్ పబ్లిక్ బ్రాడ్కాస్ట్ లో కొన్నాళ్ళు పని చేసాను. ఆతర్వాత అక్కడే ఉండే హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసాను. మిణుగురులు తీసే సమయం లో కూడా అదే టీమ్ నుంచి కొంత మంది పని చేసారు.

    ఇప్పుడా షార్ట్ ఫిలిమ్స్ ఆన్ లైన్ లో ఉన్నాయా?

    ఇప్పుడా షార్ట్ ఫిలిమ్స్ ఆన్ లైన్ లో ఉన్నాయా?

    లేదు కారణం ఏమిటీ అంటే కెనడా లాంతి ప్రదేశాల్లో షార్ట్ ఫిలిమ్స్ కి మంచి మార్కెట్ ఉంటుంది. యూట్యూబ్ లొ పెట్టేస్తే వాటిని మార్కెట్ చేయలేం అని ఆగిపోయాం. త్వరలోనే అవీ బయటికి తీసుకొద్దామనే ఆలోచన ఉంది.

    మరి టాలీవుడ్ ఆలోచన, ఇక్కడికి రావటం....

    మరి టాలీవుడ్ ఆలోచన, ఇక్కడికి రావటం....

    రెండో షార్ట్ ఫిలిం కూడా అయ్యాక నామీద నాకు కొంత నమ్మకం ఏర్పడింది, ఓకే ఇక నేను క్వాలిటీ సినిమా తీయగలను అనిపించింది. అప్పటికే తెలుగులో నాలుగు స్క్రిప్ట్ లు రాసుకొని ఉన్నాను వాటి మీద వర్క్ చేయాలనిపించింది. 2009 లో మొదలయిన ఆలోచన ఒక్క సంవత్సరం గడిచే లోపు నన్ను నేను కంట్రోల్ చేసుకోలెనంత పెరిగి పోయింది. అంతే ఇండియా వచ్చేసాను. అన్ని రోజులూ నాలో ఉన్నది ఒకే ఒక కల సినిమా తీయటం.. దానికి ఎంత కష్ట పడాలో తెలుసు కానీ సినిమా తీయకుండా ఉందలేను అనిపించింది. అక్కడ కూడా సినిమాలు చేయాలనే ఉండేది కానీ నా మొదటి ప్రాజెక్ట్ మాత్రం "మిణుగురులు" ఎందుకంటే చెప్పలేను గానీ ఒక తెలుగు మనిషిగా, భారతీయుడిగా అది నా పనేమో అనిపించింది...

    మిణుగురులు మన ఇండస్ట్రీలో కమర్షియల్ థాట్ కాదు, ఖచ్చితంగా హిట్ అవుతుందీ అని చెప్పలేని సబ్జెక్ట్ కదా.., మొదటి సినిమా నే ఇలంటి సబ్జెక్ట్ మీద చేయాలని ఎలా అనిపించింది?

    మిణుగురులు మన ఇండస్ట్రీలో కమర్షియల్ థాట్ కాదు, ఖచ్చితంగా హిట్ అవుతుందీ అని చెప్పలేని సబ్జెక్ట్ కదా.., మొదటి సినిమా నే ఇలంటి సబ్జెక్ట్ మీద చేయాలని ఎలా అనిపించింది?

    (చిన్నగా నవ్వు) మిణుగురులు మొదలు పెట్టే సమయానికే నాదగ్గర రొమాంటిక్ యాంగిల్ లో రాసుకున్న స్క్రిప్ట్లు ఆరు ఉన్నాయి, అసలు ముందు ఆ సినిమానే తీయాలనే ఆలోచన కూడా వచ్చింది కానీ మొదలు పెట్తే ముందు మళ్ళీ ఎందుకో "మిణుగురులు" వైపే తిరిగాను, ఎందుకో గానీ ఈ సబ్జెక్ట్ ఇప్పుడైతేనే తీయగలను, నేను చేయాల్సిన పని ఇదే అనిపించింది. మరో విషయం ఏమిటంటే మిణుగురులు యూనివర్సల్ సబ్జెక్ట్. ఒక ప్రాంతానికో, ఒక భాషకో సంబందించింది కాదు ప్రపంచం లో ఏమూలనైనా, ఎలాంటి మనిషైనా ఈ సినిమాని ఫీల్ అవగలడు. అందుకే ఈ సినిమాను ఎంచుకున్నానేమో.., నిజానికి మేం తీసుకున్న ఆర్టిస్టులు కూడా ఆశిశ్ విధ్యార్థి, రఘువీర్ యాదవ్ ఇలా రెండు భాషల్లోనూ తెలిసిన వాళ్ళే... కానీ ఆర్థిక ఇబ్బందులవల్ల రెండు భాషల్లో తీయలేకపోయాం. ఒకరకంగా అదే మైనస్ అయ్యింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్తివల్స్, ఆస్కార్ల వరకూ వెళ్లగలిగిన సినిమా కమర్షియల్ గా మాత్రం అంత విజయాన్ని సాధించలేదు. అయితే ఆవిషయం లో నాకు పెద్దగా భాద అయితే లేదు.

    ఇప్పుడు ఆలోచన ఎలా ఉందీ... అంటే మళ్ళీ లవ్ స్టోరీల వైపు వెళ్తున్నారా...??

    ఇప్పుడు ఆలోచన ఎలా ఉందీ... అంటే మళ్ళీ లవ్ స్టోరీల వైపు వెళ్తున్నారా...??

    ఎందుకు వెళ్లను... ఇండస్ట్రీ కి రెండు సినిమాలూ అవసరమే అన్నీ మిణుగురులు లాంటి సినిమాలే రావటం పరిశ్రమకి దెబ్బే కదా.., నేనూ కమర్షియల్ యాంగిల్ లో కూడా తీస్తాను. ఈ సారి రాబోయేది లవ్ స్టోరీనే., అయితే కామెడీ పేరుతో వచ్చే బూతు జోకులూ, అవసరం లేకున్నా ఉండే ఐటం సాంగులూ మాత్రం నాదగ్గర కోరుకోవటం కష్టం...

    అసలు సినిమా వైపు రావాలని ఎప్పుడు, ఎందుకు అనిపించింది.?

    అసలు సినిమా వైపు రావాలని ఎప్పుడు, ఎందుకు అనిపించింది.?

    చిన్నప్పటి నుంచీ నేను మంచి ర్యాంకర్ ని టెంత్ వరకూ ఫుల్ మార్క్స్ తోనే ఉన్నాను.., ఇంటర్లో మొదలయ్యింది ఈ సినిమా అనే కల వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ లో మెరైన్ కెమిస్ట్రీ లో మాస్టర్ డిగ్రీ చేసాను. అయితే లోపల మాత్రం సినిమా చేయాలి అనే ఇంట్రస్ట్ ఉండేది... అదే ఇంట్రస్ట్ అన్ని అవకాశాలనూ వదిలేసి అమెరికాలో ఫిలిం మేకింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యేదాకా తీస్కెళ్ళింది. ఒక్కసారి అక్కడ అడుగు పెట్టాక మళ్ళీ వెనక్కి చూడాలనిపించదు అక్కడ చేరిన అందరిదీ ఒకే లక్ష్యం... సినిమా అంతే...

    మెరైన్ కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ తెచ్చుకుని కూడా సంపాదన వైపు కాకుండా సినిమా వైపు వెళ్తానన్నప్పుడు ఇంట్లో ఏమన్నారు...?

    మెరైన్ కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ తెచ్చుకుని కూడా సంపాదన వైపు కాకుండా సినిమా వైపు వెళ్తానన్నప్పుడు ఇంట్లో ఏమన్నారు...?

    దానికి నాదగ్గరో ప్లాన్ ఉంది డైరెక్ట్ గావెళ్లలేదు.... అప్పటికే మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు నేనూ సాఫ్ట్ వేర్ జాబ్ కోసం వస్తున్నా అనగానే వీసా దగ్గరనుంచీ అన్ని ఏర్పాట్లూ చేసాడు... బుద్దిగా వెళ్ళి జాబ్ లో చేరాను కొన్ని సంవత్సరాలు జాబ్ చేసాను కూడా తర్వాత నెమ్మదిగా ఫిలిం స్కూల్లో జాయినయ్యాను... కొన్నాళ్ళపాటు స్కూల్ జాబ్ రెండూ చేసాను ఆ తర్వాత ఒక రోజు మొత్తం జాబ్ మానెసాను.. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాను ఒకేసారి అంటే ఎవరైనా ఏమంటారో తెలుసు కదా...

    మిణుగురులు సినిన్మా వచ్చాక అవార్డ్ విషయం తెలియటానికి కొంత సమయం పట్టింది కదా... అవార్డ్ కి ముందు అవార్డ్ తర్వాత మీ ఫీలింగ్ ఏమిటి?

    మిణుగురులు సినిన్మా వచ్చాక అవార్డ్ విషయం తెలియటానికి కొంత సమయం పట్టింది కదా... అవార్డ్ కి ముందు అవార్డ్ తర్వాత మీ ఫీలింగ్ ఏమిటి?

    ఫీలింగ్ అంటే పెద్దగా ఏముంటుందీ... అవార్డ్ ముందు వరకూ మంచి సినిమా అని మెచ్చుకోళ్ళూ.., అవార్ద్ తర్వాత కొన్ని చాన్స్లూ వచ్చాయి. అలా అని అప్పుడు కుంగిపోయిందీ లేదు.., ఇప్పుడు ఇది నా ఒక్కడి విజయమే అని ఎక్కువుగా పొంగిపోయిందీ లేదు. మిణుగురులు అనే సినిమా కి దక్కాల్సినది దక్కి తీరుతుందనే నమ్మకం ఎప్పుడూ ఉంది.

     మిణుగురులు తర్వాత మూడేళ్ళు సినిమా ప్రయత్నం చేయలేదు ఒక్క ఆఫర్ కూడా రాలేదా..??

    మిణుగురులు తర్వాత మూడేళ్ళు సినిమా ప్రయత్నం చేయలేదు ఒక్క ఆఫర్ కూడా రాలేదా..??

    వచ్చాయి... కోటి దాటకుండా తీస్తారా? మళయాళం రీమేక్ తీస్తారా? అని అడిగేవాళ్ళు లేదంటే ఒక కొరియన్ సినిమా కాపీ తీస్కోండీ అనే వాళ్ళే కొన్ని ఆప్షన్లతో వచ్చారు. నిజానికి డబ్బుకోసం ఈ ఆఫర్లన్నీ ఒప్పుకోవచ్చు, కమర్షియల్ గా హిట్ అయ్యేవేమో కూడా. కానీ నా స్టోరీలు నాదగ్గర ఉన్నప్పుడు మళ్ళీ, కాపీలూ, రీమేక్ లూ చేయటం నచ్చలేదు. ఇక నేనే నా కథలతో ట్రై చేసాను కానీ ఎక్కువమంది మిణుగురురులు చూడకపోవటం, చూసిన కొందరు హీరోలకీ నేనొక ఆర్ట్ డైరెక్టర్ అనిపించటం వల్ల వెనకడుగువేసారు.. నిజానికి నాదగ్గర ఉన్న 10 స్క్రిప్టుల్లో ప్రతీ హీరోకీ సరిపోయేవే. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కి కూడా సరిపోయేలా ఉన్న స్క్రిప్ట్ ఒకటుంది.

    మళ్ళీ మిణుగురులు దగ్గరికి వస్తే.... 40 మంది బ్లైండ్ పిల్లలకి సీన్ ఎలా చెప్పారు? ఎలా చేయించారు? ఇబ్బంది అవలేదా....?

    మళ్ళీ మిణుగురులు దగ్గరికి వస్తే.... 40 మంది బ్లైండ్ పిల్లలకి సీన్ ఎలా చెప్పారు? ఎలా చేయించారు? ఇబ్బంది అవలేదా....?

    లేదు..! ఆడిషన్స్ దగ్గరే సగం వర్క్ అయిపోయింది తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లలో ఉన్న అన్ని బ్లైండ్ స్కూళ్ళలోనూ ఆడిషన్స్ చేసాం.. సెలక్ట్ అయిన పిల్లలనే తీసుకున్నాం, అందులోనూ వాళ్ళు మనం అనుకున్నంత తక్కువ కాదు మీరు చెప్పిన విషయాన్ని నార్మల్ పీపుల్ కంటే కూడా ఫాస్ట్ గా గ్రహించగలరు. ఇంకా ఆశర్యపోయే విషయ ఏమితంటే డబ్బింగ్ కూడా వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు. అప్పుడు మాత్రం వాళ్ళని చూసి ఆశ్చర్యం వేసింది. వీల్లని తక్కువగా చూసే సమాజం మీద జాలికూడా వేసింది.

    లీడ్ క్యారెక్తర్

    లీడ్ క్యారెక్తర్

    లీడ్ క్యారెక్తర్ చేసి అమ్మాయీ అబ్బాయి ఇద్దరూ కూడా నార్మల్ పిల్లలే అయిన నాచురాలిటీ కోసం అమెరికానుంచి తెప్పించిన లెన్స్ వాడాం, అదిపెట్టుకుంటే అంతా బ్లర్ అయిపోతుంది, బ్లైండ్ పీపుల్ ఎలా ఉంటారో అలా అన్నమాట. వాళ్ళు చాలా కష్టపడ్డారు, ప్రతీసీన్ కోసం వాళ్ళు మిగతా పిల్లలని అబ్సర్వ్ చేసేవాళ్ళు. ఆ కష్టం ఊరికే పోలేదు ఆ ఇద్దరికీ నంది అవార్డ్ వచ్చింది. టీచర్ గా చేసిన రఘువీర్ యాదవ్ కి కూడా అలాంటి లెన్స్ నే వాడాం. ఇక ఎల్వీ ప్రసాద్ రీసెరెచ్ సెంటర్నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ బాగా హెల్ప్ చేసారు. వాళ్ళు మాతోనే ఉంటూ పిల్లలని ట్రెయిన్ చేసారు.

    సినిమా మరీ లోబడ్జెట్ గా అనిపించలేదు, ఎందుకంటే సౌండ్, కెమెరా ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా, మంచి క్వాలిటీతో ఉన్నాయి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు.

    సినిమా మరీ లోబడ్జెట్ గా అనిపించలేదు, ఎందుకంటే సౌండ్, కెమెరా ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా, మంచి క్వాలిటీతో ఉన్నాయి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు.

    హ..హ.. మరీ లోబడ్జెట్ సినిమా ఏం కాదు నిజానికి సౌండ్ అంతా రసూల్ పూకుట్టి స్టుడియో లో చేసింది. రసూల్ తెల్సు కదా రెహమాన్ తో పాటు గా ఆస్కార్ అందూకున్నారు, సౌండిజైనర్ అమృత్ ప్రీతమ్ "ఓంకారా" సినిమాకి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ప్రొడక్షన్ డిజైనర్, ఇద్దరుకెమెరా మెన్ లు కూడా హాలీవుడ్ నుంచి వచ్చారు. సుభ్రమణ్యపురం (అనంతపురం) సినిమాకి చేసిన ఆర్ట్ డైరెక్టర్ రాంబన్ బాలరాజు గారు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసారు. ఆ హాస్టల్ బిల్దింగ్, లోపలి గదులూ అన్నీ ఆయన పర్యవేక్షణ లోనే సెట్ వేసాం. ఆరునెలలు అక్కడే ఉండి ఆ హాస్టల్ కట్టాం... అది పాత గవర్నమెంట్ బిల్డింగ్ కి చుట్టూ అన్నీ గదులూ కట్టుకున్నాం. ఎక్కడా రాజీ పడలేదు ప్రతీ టెక్నీషియన్ మంచి టాలెంట్ ఉన్నవాళ్ళే... ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాలీవుడ్లో బస్ ఏక్ పల్, మై బ్రదర్ నిఖిల్ లాంటి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన వివేక్ ఫిలిప్.

    ఈ కథ రాసుకున్నది మీరేనా?

    ఈ కథ రాసుకున్నది మీరేనా?

    మొత్తం నేను కాదు మొదట ఈ కథ ఇచ్చింది ఎన్వీబీ చౌదరి గారు, ఆతర్వాత ఆయనా నేనూ, మహేష్ కత్తి ముగ్గురం కలిసి ఫస్ట్ డ్రాఫ్ట్ రాసుకున్నాం. ఆ తర్వాత నేనే మళ్ళీ 11 డ్రాఫ్ట్స్ రాసుకున్నాను మధ్యలో చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడే కాదు హాలీవుడ్ లో నా టీచర్ రోజర్ మార్గోలిస్ అనిన్ ఉండేవారు ఆయనని కూడా హైర్ చేసుకోవాల్సి వచ్చింది అలా ఎట్టకేలకు 15 నెలలకి ఇలా వీళ్లందరూ కలిస్తే స్క్రిప్ట్ప్ట్ తయారయ్యింది.

    షూటింగ్ అయిపోయాక విడుదల చేయటానికి చాలానే టైం తీసుకున్నారు ఎందుకలా?

    షూటింగ్ అయిపోయాక విడుదల చేయటానికి చాలానే టైం తీసుకున్నారు ఎందుకలా?

    2012 డిసెంబర్ లో చిరంజీవి గారికోసం వేసిన షో తర్వాత సంవత్సరం కష్తపడ్డాం కేవలం జనం లోకి తేవటానికే పట్టిన సమయం అది. ఆ మధ్యలో చాలా మందికోసం దాదాపు నలభై షోలు వేసాం. అందరూ చాలా మెచ్చుకున్నారు, అద్బుతమైన సినిమా అన్నారు కానీ ఎవ్వరూ రిలీజ్ చేయటానికి ముందుకురాలేదు. అదే సమయం లో ఒకరోజు తెల్లవారు ఝామునే కాల్ వచ్చింది. "నేను మీ సినిమా చూసాను ఒక సారి మా ఇంటికి రాగలరా మీతో మాట్లాడాలీ అని" ఆయన దాసరి నారాయణ రావు గారు. వెళ్ళాక ఆయన చెప్పారు నేను మీసినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాను అదీ నా సమర్పణలో అని చెప్పారు, నిజానికి ఎప్పుడూ బయటి సినిమాలకి దాసరి సమర్పణ అని వెయ్యలేదు. కానీ ఈ సినిమాకి మాత్రం అలా జరిగింది. అప్పటికప్పుడు 40 థియేటర్లు మాట్లాడి ప్రత్యేక శ్రద్ద తీసుకొని రిలీజ్ చేసారు... అలా మిణుగురులు బయటకు వచ్చింది.

    సినిమా తీసాక రిలీజ్ చేయలేని సమయం లో డిసప్పాయింట్ గా ఏమైనా ఫీలయ్యారా??

    సినిమా తీసాక రిలీజ్ చేయలేని సమయం లో డిసప్పాయింట్ గా ఏమైనా ఫీలయ్యారా??

    హ్మ్మ్..! మామూలుగా దేన్నీ ఎక్కువ మనసులోకి తీసుకునే మనస్థత్వం కాదు నాది. కానీ సినిమాని బయటికి తీసుకురాలేకపోయినప్పుడు మాత్రం కొన్నాళ్ళు చాలా బాదపడ్దాను, ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతింది. దాన్నుంచి రికవర్ అయ్యాను అయితే ఇక్కడ నేను ఇబ్బంది పడ్డాను అనటం కంటే ఆ ప్రాబ్లం వల్ల మరింత స్ట్రాంగ్ అయ్యాను అనుకుంటాను

    తర్వాతి ప్రాజెక్టుల గురించి...

    తర్వాతి ప్రాజెక్టుల గురించి...

    ఈ సారి పక్కా కమర్షియల్ సినిమా తీయబోతున్నాను. దీన్నొక మ్యూజికల్ హిట్ చేయాలనుకుంటున్నాను ఏడుపాటల్లో నాలుగు ఇప్పటికే రికార్డింగ్ అయిపోయాయి కూడా, ఈ సారి కూడా బాలీవుడ్ నుంచే వచ్చిన జాయ్ బారో దీనికి సంగీతం అందిస్తున్నాడు.

    దీనికీ ప్రొడ్యూసర్ మీరేనా..??

    దీనికీ ప్రొడ్యూసర్ మీరేనా..??

    ఇప్పటికైతే నేనే.., ప్రీ ప్రొడక్షన్ లో కొన్ని ఖర్చులు నావే అయినా ఈ సారి కాస్త పెద్ద హీరోతో చేస్తున్నాం కాబట్టి ప్రొడ్యూసర్ కూడా వేరే అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్ లో తీసేయోచ్చుకానీ ఒక పేరున్న ప్రొడక్షన్ కంపెనీ నుంచి వస్తే మార్కెట్ లో నిలబడే వీలుంటుంది కదా..

    టాలీవుడ్ లో మసాలా సినిమాలు తప్ప మిగతా సినిమాలు హిట్ కావనే ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంటుంది.., మీరు ఏకీభవిస్తారా..??

    టాలీవుడ్ లో మసాలా సినిమాలు తప్ప మిగతా సినిమాలు హిట్ కావనే ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంటుంది.., మీరు ఏకీభవిస్తారా..??

    నెవర్..! మీరు ఆనంద్ సినిమా చూసారు కదా మామూలు సినిమా రాజా, కమలిని, అంతెందుకు అప్పటికి శేఖర్ ఖమ్ముల కూడా పెద్ద తెలిసిన మనిషేం కాదు, సినిమాలో ఏ మాస్, మసాలా లాంటివి లేవు కానీ 5 థియేటర్లతో మొదలై సూపర్ హిట్ అందుకున్నాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు అంత ఎక్కువ టైం లేదనుకోండి వారం, రెండు వారాల్లో ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా పక్కకు పోవాల్సిందే... అయితే మనం చూడాల్సింది ఆనంద్ ఎందుకు ఎక్కువ మందికి నచ్చిందని, ఇక ఆనంద్ ని పక్కన పెడితే రీసెంట్ గా వచ్చిన ఘాజీ.. ఈ సినిమాలోనూ మీరనే మసాలా ఏం లేదు కానీ అవి హిట్ అయ్యాయి కదా...

    మిణుగురులు విషయం లో అవార్డు మాత్రమే కాక అత్యంత సంతోషంగా అనిపించిన సందర్భం ఏదైన్న ఉందా..??

    మిణుగురులు విషయం లో అవార్డు మాత్రమే కాక అత్యంత సంతోషంగా అనిపించిన సందర్భం ఏదైన్న ఉందా..??

    జయసుధ గారు మిణుగురులు చూసాక అసలు ఎందుకని మీడియా ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు? అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఏడు నంది అవార్డులు సాధించిన సినిమా అసలు వార్తల్లోనే కనిపించటం లేదు అంటూ చెప్పారు. తర్వాత నాకు కాల్ చేసి మాట్లాడారు "ఇన్నేళ్ల నా కెరీర్ లో నాకు ఒక పాత్ర ఇవ్వండీ అని ఎవర్నీ అడగలేదు కానీ.... మీ దర్శకత్వం లో చేయాలనుంది" అని సహజ నటి జయసుధ గారు చెప్పటం ఎనిమిదో అవార్డ్ నాకొసం ఇచ్చినట్టు అనిపించింది....

    English summary
    Ayodhya Kumar Krishnamsetty went to USA to do a software job and ended up studying in film school. He wanted to make a romantic comedy in Telugu and ended up making Minugurulu. Here is an special interview by Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X