twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐసీయూలో ప్రముఖ దర్శకురాలు.. అండగా నిలిచిన ఆమీర్, సల్మాన్..

    By Rajababu
    |

    Recommended Video

    ఐసీయూలో ప్రముఖ దర్శకురాలు

    బాలీవుడ్ చిరస్మరణీయంగా నిలిచే చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకురాలు కల్పనా లాజ్మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దాంతో ఆమెను ముంబైలోని హాస్పిటల్‌లోని ఐసీయూలో ఉంచి వైద్య చికిత్సను అందిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఆమె కిడ్నీ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. బాలీవుడ్‌లో రుడాలీ (1993), ఏక్ పల్ అనే చిత్రాల ద్వారా కల్పనా లాజ్మీ అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

    హార్ట్‌బీట్ పడిపోయింది

    హార్ట్‌బీట్ పడిపోయింది

    మంగళవారం ఉదయం హృదయ స్పందన పడిపోయింది. దాంతో శ్వాస పీల్చడంలో అసౌకర్యంగా ఫీలయ్యాను. కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. రెండు కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం లేదు. సోమవారం నా జీవిత భాగస్వామి భూపెన్ హజారికా వర్ధంతి. ఆ కార్యక్రమం కోసం నేను నవీ ముంబైలోని ఆయన ఇంటికి వెళ్లాను. ఆ అలసట కారణంగా ఉదయాన్నే చాలా బలహీనంగా కనిపించాను. దాంతో ఐసీయూలో చేరాను. మరో 48 గంటలు గడిచిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేస్తాం కల్పనా లాజ్మీ చెప్పారు.

    పూర్తిగా బెడ్‌కే పరిమితం

    పూర్తిగా బెడ్‌కే పరిమితం

    గత రెండేళ్ల క్రితం పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యాను. దేవుడు దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. నా అంతట నేను ఎవరి సహాయం లేకుండా లేచి నడువడానికి మరో సంవత్సరం పట్టవచ్చు అని కల్పన లాజ్మీ తెలిపారు.

     అమీర్, రోహిత్, సల్మాన్ సహాయం

    అమీర్, రోహిత్, సల్మాన్ సహాయం

    ప్రతీవారం డయాలిసిస్ చికిత్స జరుగున్నది. నా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో బాలీవుడ్ పరిశ్రమ ఆర్థిక సహాయం అందించింది. నాకు సహాయపడిన వారిలో అమీర్ ఖాన్, రోహిత్ శెట్టి, సల్మాన్ ఖాన్, ఆలియాభట్, సోని రజ్దాన్, నీనా గుప్తా, ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ తదితరులు ఉన్నారు.

     అందరికీ రుణపడి ఉంటాను

    అందరికీ రుణపడి ఉంటాను

    కష్టకాలంలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. విపత్కర పరిస్థితుల్లో నా వెంట ఉండి నిరంతరం నైతిక స్థైర్యాన్ని ఇస్తున్న శ్యాం బెనగల్, నా తల్లి, సోదరుడికి రుణపడి ఉంటాను అని చెప్పారు.

     రుడాలీ చిత్రానికి ప్రశంసలు

    రుడాలీ చిత్రానికి ప్రశంసలు

    కల్పనా లాజ్మీ మహిళా కథా నేపథ్యం ఉన్న చిత్రాలను రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. రుడాలీ చిత్రం ఆమెకు మంచి పేరు ప్రతిష్టల్ని తెచ్చిపెట్టింది. బాలీవుడ్ దిగ్గజం గురుదత్‌కు ఆమె మేనకోడలు. ప్రముఖ సంగీత దర్శకుడు భూపెన్ హజారికాతో ఆమె 40 ఏళ్లపాటు సహజీవనం చేశారు. ఆయన జీవితం ఆధారంగా సినిమా తీయాలనే ప్రయత్నం ముందుకు సాగలేదు. కల్పనా లాజ్మీ దర్శకత్వం వహించిన చింగారీ చిత్రం 2006లో విడుదలైంది. మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది.

    English summary
    Filmmaker Kalpana Lajmi, who made a mark in Hindi cinema with films like Rudaali (1993) and Ek Pal (1986), was rushed to the hospital this morning after her condition worsened. The director has been battling kidney cancer for several months now. She is the niece of legendary actor Guru Dutt. She wanted to make a film on singer Bhupen Hazarika, who she lived with for about 40 years, but hasn't been able to yet. Kalpana Lajmi's last film released in 2006, Chingaari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X