సినీ నిర్మాత కొసరాజు మృతి
సినీనిర్మాత, శ్రీ లక్ష్మీరాజ కమర్షియల్స్ అధినేత కొసరాజు రాజేంద్రబాబు(58) మంగళవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొసరాజు హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా సూరంపల్లి ఆయన స్వస్థలం. గతంలో ఆయన సామ్రాజ్యం , సంగ్రామం, వీర విహారమ్, సమర్పణ, నేరము, లేత మనసులు.. చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కొసరాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.


Click it and Unblock the Notifications











