డైరెక్టర్ KV ఆనంద్ గుండె నొప్పితో చనిపోలేదు.. హీరో సూర్య రావడంతో బయటపడిన కొత్త ట్విస్ట్
సినిమా పరిశ్రమలో ఒక విషాద ఘటన గురించి మారచిపోక ముందే మరొక భయంకరమైన వార్తలు వినాల్సి వస్తోంది. దేశంలో ఈసారి సామాన్య ప్రజల నుంచి అగ్ర ప్రముఖుల వరకు చాలా మంది ప్రాణాలు విడిచారు. కొందరిని కరోనా దెబ్బకొడితే మరికొందరిని కాలం కాటు వేసింది. ఇక రీసెంట్ గా అగ్ర దర్శకుల్లో ఒకరైన KV ఆనంద్ మరణం కూడా ప్రతి ఒక్కరినీ షాక్ కు గురి చేసింది. అయితే ఆయన గుండెనొప్పితో చనిపోలేదని తెలుస్తోంది. సూర్య రాకతో ఒక విషయం బయటకు వచ్చింది.

అంతటి మంచి వ్యక్తి..
దర్శకుడు కెవి.ఆనంద్ మంచి టెక్నీషియన్ గానే కాకుండా మానవత్వ విలువలు కలిగిన గొప్ప వ్యక్తి అంటూ ఇండస్ట్రీలో అందరూ చెబుతుంటారు. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా హెల్ప్ చేస్తారని చెబుతుంటారు. అంతటి మంచి వ్యక్తి మరణం ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరిని షాక్ కు గురి చేసింది.

శంకర్ తో బిగ్గెస్ట్ హిట్
సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆనంద్ తన వర్క్ తో సినిమాలకు ప్రాణం పోశారు. డైరెక్టర్ శంకర్ సూపర్ హిట్ మూవీస్ కు మొదట్లో ఆయనే వర్క్ చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన శివాజీ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత ఆనంద్ దర్శకుడిగా కూడా తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నారు.

సూర్యతో బ్రదర్స్ అనుబంధం
ఇక సూర్యతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. సూర్యతో వీడొక్కడే , బ్రదర్స్, బందోబస్త్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. నిజానికి సూర్య అతన్ని ఒక దర్శకుడిలా కాకుండా అన్నయ్యలా గౌరవించేవారు. ఇక ఆనంద్ కెరీర్ లో రంగం సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అసలు కారణం గుండెపోటు కాదట
ఇక శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఆనంద్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అందరూ అదే నిజమని అనుకున్నారు. కానీ ఆనంద్ మరణానికి అసలు కారణం గుండెపోటు కాదట. ఈ విషయం హీరో సూర్య రాకతో అందరికి తెలిసింది.
Recommended Video

అసలు నిజం ఇదే..
హీరో సూర్య డైరెక్టర్ KV ఆనంద్ మృతికి సంబంధించిన వార్తలు చూడగానే వెంటనే కడసారి చూడాలని హాస్పిటల్ కు వెళ్లారు. అయితే వైద్యుల నుంచి అనుమతి లబించలేదు. ఆనంద్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలిందట. శ్వాస ఆడకపోవడం వల్లే కన్నుమూశారని సమాచారం. ఈ విషయం తమిళ మీడియాలో వైరల్ గా మారింది. ఇక KV ఆనంద్ మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం వైద్యులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించారు. హాస్పిటల్ లోనే దూరం నుంచి అతని కుటుంబ సభ్యులు కొద్దిసేపు నివాళులర్పించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











