తెలుగు సినిమా ‘శక్తి’ ఇదీ అని మరోసారి నిరూపించేది జూ ఎన్టీఆరే...
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మొహర్ రమేష్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మితస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'శక్తి" మార్చి 30న విడుదలకు సిద్దమవుతోంది. కాగా 'శక్తి" ఆడియోని ఇదే నెల 27న మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటీవలే మీడియాలో వెలువడ్డ 'శక్తి" డిజైన్స్ అన్నిటికీ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్ టింజ్ తో బాటు కాస్త డివోషనల్ టచ్ కూడా వుందనే అంశం ఎలివేట్ అయ్యేలా ఈ చిత్రానికి చక్కని అవుట్ లుక్ తీసుకొచ్చి అందరిలో అటెన్షన్ క్రియేట్ చేశారు అశ్వనీదత్.
అలాగే ఈ శక్తి లో రక్తికీ లోటుండదని తెలిసేలా ఎన్టీఆర్ ఇలియానాల కాంబినేషన్ స్టిల్స్ తో తాజాగా మరికొన్ని డిజైన్స్ ని మనముందుకు పంపారు. అంతే కాకుండా ప్రతి నాలుగు రోజులకు ఒకసారి డిఫరెంట్ పోస్టర్స్ విడుదలచేస్థామని ఫిల్మిం మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే ఈ చిత్రంలోని మరో హీరోయిన్ మంజరి కూడా తన గ్లామర్ 'శక్తి"ని చూపించేందుంకు రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. మొత్తానికి మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులనీ ఆకర్షించే పసందైన ప్యాకేజ్ లా కనిపిస్తోన ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ 'శక్తి"ని చూపించడమే కాకుండా ఓ తెలుగు సినిమా 'శక్తి" ఇదీ అని నిరూపించే స్తాయిలో సంచలనం సృషించి సరికొత్త రొకార్డులకు తెరతీస్తుందని ఆశిస్తున్నారు సినీజనం..


Click it and Unblock the Notifications











