చార్మికి చివరి ఛాన్స్ అంటున్నారు
చార్మి హీరోయిన్ గా చేసిన మాయగాడు చిత్రం త్వరలో విడుదల అవుతోంది.వేణు హీరోగా చేసిన చిత్రం చాలా కాలం ల్యాబ్ లో మగ్గి ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అవుతోంది. చార్మి రీసంట్ గా చేసిన నగరం నిద్రపోతున్న వేళ, బుడ్డా సినిమాలు ఆమె కెరీర్ కి ఏమీ మైలేజి తేలేకపోయాయి. దాంతో రెచ్చిపోయి నటించిన ఈ సినిమా ఆమెకు ఆఖరి ఛాన్స్ వంటిదంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరో టైటిల్‌కి తగ్గట్టుగానే అన్నీ మాయ పనులే చేస్తుంటాడు. అయితే ఆ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. పల్లెటూరిలో ఉన్నప్పుడు ఏ మాత్రం కష్టపడకుండా మాయమాటలతో పబ్బం గడుపుతుంటా. పల్లెటూరిలో ఆవారాగా గడిపేసినా, నగరానికి వచ్చాక మాత్రం వాస్తవాలు తెలుసుకుని హీరోలా మారతాడు. ఇంతకీ ఈ చిత్రం చార్మి కెరీర్ కి ఉపయోగపడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











