ఆరెంజ్ చిత్రం ఎలావుంటుందనేది ఫైనల్ గా ఓ క్లూ దొరికిపోయిందోచ్...
రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్" చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్టీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. కాగా..ఈ చిత్రం గురించి సెన్సార్ బోర్ట్ సభ్యుల అభిప్రాయం ఎలా ఉందోనని కొంతమంది ఆరా తీశారట. సెన్సార్ అభిప్రాయం ఈ విధంగా ఉంది. మగధీర మెసర్మేజ్ చేసింది. అంతటి రేంజ్‌నుంచి బయటపడాలంటే కొత్తగా మరో కోణంలో చూపించారు. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలా హాయిగా ఎంజాయ్ గా ఉంటుంది. మగధీర షూటింగ్ లోనే చరణ్ నాకు ఇలాంటి కథతో చేయాలనుకున్నాడు. ఈ చిత్రం ఫస్టాఫ్ లో బ్రహ్మానందం, రామ్ చరణ్ మద్య సాగే కామెడీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట. ఊహించని మలుపులతో సెకండాఫ్ ఆసక్తికరంగా ఉంటుందట. ఇది పక్కా ప్రేమకథా చిత్రమని, ప్రేక్షకులు ఈ చిత్రంలో ప్రేమలో పడిపోవడం ఖాయం అని సెన్సార్ బోర్డ్ వారు అంటున్నారట. ఇక హైలైట్స్ విషయానికొస్తే..కథ, భాస్కర్ నారేషన్ అదుర్స్, పాటల చిత్రీకరణ ఫెంటాస్టిక్, జెనీలియా యాక్టింగ్ ప్లస్, బ్రహ్మీ కామెడీ టైమింగ్ సూపర్, చరణ్ డాన్స్ లు డైలాగ్ డెలివరీ, నటన మైండ్ బ్లోయింగ్...మరి చిత్రం హిట్ కొట్టడానికి ఇంతకంటే ఇంకేం కావాలి.


Click it and Unblock the Notifications











