twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి చెబితే జనసేనకు సపోర్ట్ చేస్తా.. పవన్, చిరు ఫాన్స్‌కు కూడా గొడవలు వచ్చాయి: బన్నీ

    |

    Recommended Video

    Allu Arjun Opens Up About Janasena Party

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిన్నటితో ( ఆదివారం) 35 వ పడిలోకి అడుగుపెట్టాడు. గంగోత్రి చిత్రంతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు. మెగా మేనల్లుడిగా అడుగు పెట్టిన బన్నీ టాలీవుడ్ లో వెనుదిరి చూసుకోవలసిన అవసరం రాలేదు. రెగ్యులర్ గా బన్నీ హిట్లు కొడుతూ వచ్చాడు. ప్రస్తుతం బన్నీకి టాలీవడ్ లో మంచి మార్కెట్ ఉంది.

    టాలీవుడ్ లో మాత్రమే కాక మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉన్న ఏకైక హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. అల్లు అర్జున్ కంటూ ప్రస్తుతం ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. తన పుట్టినరోజు సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూస్ లో బన్నీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

     35 వ పడిలోకి స్టైలిష్ స్టార్

    35 వ పడిలోకి స్టైలిష్ స్టార్

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం రోజు 35 వ పడిలోకి అడుగుపెట్టాడు. గంగోత్రి చిత్రంతో హీరోగా తన ప్రయాణం మొదలు పెట్టిన అల్లు అర్జున్ తక్కు టైంలోనే తన నటన డాన్సులతో భారీగా అభిమానులని సొంతం చేసుకున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించాడు.

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి

    గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబం రాంచరణ్, వరుణ్, సాయిధరమ్ తేజ్ నుంచి పవన్ కు సపోర్ట్ లభించింది. కానీ బన్నీ మాత్రం జనసేన పార్టీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. తాజాగా బన్నీ జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు.

    ఆయన చెబితే జనసేనకు సపోర్ట్ చేస్తా

    ఆయన చెబితే జనసేనకు సపోర్ట్ చేస్తా

    ప్రస్తుతం చిరంజీవి క్రియాశీలక రాజకీయాల్లో లేరు. పొలిటికల్ గా నాకంటూ ఓ స్టాండ్ లేదని బన్నీ తెలిపాడు. ఒకవేళ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సపోర్ట్ చేయమంటే తను కూడా చేస్తానని బన్నీ తెలిపాడు. ఆయన మాటే తన మాట కూడా అని బన్నీ అన్నాడు.

     చిరు, పవన్ ఫాన్స్ మధ్య గొడవలు

    చిరు, పవన్ ఫాన్స్ మధ్య గొడవలు

    మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, వరుణ్, సాయిధరమ్ తేజ్ శిరీష్.. ఇలా ఎవరి ఫాలోయింగ్ వారికీ ఉంది. మొత్తంగా మెగా ఫాన్స్ అంతా ఒక్కటే. కానీ అప్పుడప్పుడు వీరిమధ్య చిన్న సహజమే. కళ్యాణ్ గారు వచ్చిన కొత్తల్లో ఆయనకు ప్రత్యకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. చిరు, పవన్ ఫాన్స్ మధ్య ఎన్నో గొడవలు చూసా. కానీ మళ్ళీ వారంతా కలసిపోతుంటారు. ఇదంతా సహజమే అని బన్నీ తెలిపాడు.

    బాక్స్ ఆఫీస్ లెక్కల గురించి

    బాక్స్ ఆఫీస్ లెక్కల గురించి

    సినిమాకు బాక్స్ ఆఫీస్ లెక్కలు అవసరమే. కానీ ఎప్పుడూ అదే పని పెట్టుకోకూడదు. సినిమా ఒప్పుకునేముందు అనేక విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది. అని కుదిరితేనే మంచి సినిమా అవుతుంది.

    రంగస్థలం చిత్రంతో నా నమ్మకం నిజమైంది

    రంగస్థలం చిత్రంతో నా నమ్మకం నిజమైంది

    తమిళ చిత్రాలు ఎక్కువగా 'రా' కంటెంట్ తో ఉంటాయి. ఆ తరహా చిత్రాలు తెలుగులో తీసినా చూస్తారని నమ్మేవాడిని. రంగస్థలం చిత్రంతో నా నమ్మకం నిజమైందని బన్నీ తెలిపాడు. చిట్టి బాబు పాత్రని రాంచరణ్ లాగా మరెవరూ చేయలేరేమో అని బన్నీ అన్నాడు.

    English summary
    Finally Allu Arjun opens up about Janasena Party. I did not have any political stand says Bunny
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X