twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ 'నో నో' అన్నాడు...నితిన్ ..'రా రా' అన్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొత్తానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ తెలుగులో అవకాసం సంపాదించాడు. ఆ మధ్యన రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రం చేస్తాడనుకుని చివరి నిముషంలో తప్పుకున్న అనిరుధ్ ఇప్పుడు నితిన్ సినిమాతో ఎంట్రీ సంపాదించాడు. ఇందులో నితిన్ పాత్రే ఎక్కువ ఉందని తెలుస్తోంది. ఈ కొలవారి కుర్రాడు తనకు ఊపిచ్చే సంగీతంతో నిలబెడతాడని భావిస్తున్నాడు నితిన్. ఈ విషయమై నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్న నిర్మాత రాధాకృష్ణ ఇచ్చిన ప్రెస్ నోట్ ఖరారు చేసింది.

    FINALLY! Anirudh Ravichander To Debut In Telugu Films

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక నితిన్ చిత్రం విషయానికి వస్తే...

    నితిన్‌ హీరోగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తారు. కథా నాయికగా సమంతను ఎంచుకొన్నారు. నితిన్‌, సమంత కలసి నటించడం ఇదే తొలిసారి. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత.

    ఆయన మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌తో ఇది మా మూడో చిత్రం. ఇది వరకు తెరకెక్కించిన 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' మంచి విజయం సాధించాయి. నితిన్‌ చిత్రంతో హ్యాట్రిక్‌ కొడతాం. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు త్వరలో ప్రకటిస్తాము''అన్నారు. వచ్చే నెల మూడో వారంలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    English summary
    Young composer Anirudh Ravichander, who has mostly worked in Tamil films, will be making his Telugu language debut with the recently announced Nithin-Trivikram's project. "Our new project with Trivikram will feature Nithiin and Samantha Ruth Prabhu in lead roles. Anirudh has been roped in to compose music, while Nataraj Subramaniam will man the camera," read a statement from the team. The film, which will go on the floors in the third week of September, will be produced by Haarika & Hassine creations banner. The project marks the third time collaboration of Trivikram and Samantha in a row. Anirudh was supposed to make his Telugu film debut with Ram Charan's Bruce Lee, but he walked out at the last minute due to prior commitments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X