బిందుమాధవికి పూరి బంపర్ ఆఫర్
ఆవకాయ బిర్యాని చిత్రంతో పరిచయమైన బిందుమాధవికి ఆ తర్వాత ఒక్క ఆఫర్ రాలేదు. అయితే తాజాగా ఆమె పూరీ జగన్నాధ్ నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్ గా సెలక్టయింది. పూరి తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా చేసే ఈ చిత్రం ద్వారా రవి అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నాడు. ఒక వారం క్రిందట సైలెంట్ గా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా హైదరాబాద్ చుట్టు ప్రక్కల జరుగుతోంది. రఘు కుంచె సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బంపర్ ఆఫర్ అనే టైటిల్ ని నిర్ణయించారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్..ప్రభాస్ హీరోగా ఏక్ నిరంజన్ చిత్రం చేస్తున్నారు.
More from Filmibeat
bindhu madhavi avakai biryani puri jagannath sai ram shankar ravi hyderabad bumper offer ఆవకాయ బిర్యాని బిందుమాధవి పూరీ జగన్నాధ్ సాయిరామ్ శంకర్ రవి హైదరాబాద్


Click it and Unblock the Notifications











