ఇప్పుడంది దృష్టీ సల్మాన్ ఖాన్ వైపే తిర్గింది. ప్రపంచ సుందరి ఐశ్వర్యను సైతం పక్కకు నెట్టేసి, కత్రినా కైఫ్ ని కౌగిలించుకున్నందుకు సరైన బుద్దే చెప్తోందంటున్నారు. గత కొంతకాలంగా సల్మాన్ ప్రియురాలుగా కత్రినా ఉంటూ అతనితో సహజీవనం చేస్తోంది. అయితే ఇప్పుడు అతనికి బై చెప్పేయాలని నిర్ణయిం తీసుకుందిట. అయితే ఆమెనుంచి తన దృష్టి తప్పుకోవటానికి సల్మాన్ అసిన్ ని సైతం ఉపయోగించుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక కత్రినా ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి సల్మాన్ రికమెండేషన్లే కారణమన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే సల్మాన్ అండదండలతో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూపోయి..ఎంతో ఎత్తుకు ఎదికిబోయిన ఆమె సల్మాన్ కి హ్యాండ్ ఇస్తాననటాన్ని చాలా మంది జీర్ణిచుకోలేకపోతున్నారు. అయితే కత్రినా అతన్నుంచి దూరం కాకపోవటానికి కారణం అతని అతి ప్రేమను భరించలేకే నంటోంది. ఏదైమైనా తన అవసరానికి వాడుకుని వదిలేయటమనేది ఎవరూ భరించలేని విషయం అంటున్నారు.