ఫైనల్ గా జూ ఎన్టీఆర్ అదుర్స్ రిలీజ్ కన్ఫర్మ్

By Srikanya

ఇప్పటికే ఎన్నోసార్లు రిలీజ్ డేట్స్ మారిన ఎన్టిఆర్ అదుర్స్ చిత్రం చివరకు సంక్రాంతి పండుగ రోజే రిలీజ్ చేయాలని కన్ఫర్మ్ చేసారు. ఈ విషయాన్ని నిర్మాత మీడియాకు తెలియచేసారు. ఈ సందర్భంగా దర్శకుడు వివి వినాయిక్ మట్లాడుతూ "ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్‌ రెండు పాత్రల్ని చేశాడు. ఆ రెండు పాత్రల్లో తను మాత్రమే చేయగలడు అనే రీతిలో పర్‌ ఫార్మ్‌ చేశాడు. మా కలయికలో రూపొందిన ఈ మూడో చిత్రం తప్పకుండా హేట్రిక్‌ విజయాన్ని నమోదు చేసుకుంటుందని ఆశిస్తున్నాను' అన్నారు.

అలాగే చిత్ర సమర్పకుడు కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ -"ఆది, సాంబ చిత్రాల తర్వాత తారక్‌ (జూ ఎన్టీఆర్‌), వినాయక్‌ ల కాంబినేషన్‌లో అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది.జూ ఎన్టీఆర్‌ను ఈ చిత్రంలో దర్శకుడు చాలా కొత్తగా చూపిస్తున్నాడు. అన్ని వాణిజ్యఅంశాల మేలు కలయికగా రూపొందు తున్న ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం వుంది' అన్నారు.

జూ ఎన్టీఆర్‌, వినాయక్‌ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం 'అదుర్స్‌'. నయనతార, షీలా నాయికలుగా వైష్ణవి ఆర్ట్స్‌ (పై)లిమిటెడ్‌ పతాకంపై వల్లభనేని వంశీమోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని పనులను పూర్తిచేసుకొని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్‌ మంజ్రేకర్‌, సయాజీ షిండే, నాజర్‌, ఆశిష్‌విద్యార్థి, బ్రహ్మానందం ఎం.ఎస్‌.నారాయణ, వేణుమాధవ్‌, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: ఛోటా.కె.నాయుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X