చివరకు తన ఫోటో పోస్ట్ చేసిన సమంత
హైదరాబాద్: గత కొద్ది కాలంగా అనారోగ్యంతో మీడియాకు,షూటింగ్ లకు దూరంగా ఉన్న సమంత ఎట్టకేలకు షూటింగ్ లకు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా తన తాజా ఫోటోను ట్విట్టర్ ఎక్కౌంట్ లో పెట్టి అభిమానులను ఆనందపరిచింది. ఇన్నాళ్ళుగా ఆమె తన హెల్త్ ప్లాబ్లంస్ ని సోషల్ నెట్ వర్క్ లో తెలియబరుస్తూ వచ్చినా తన ఫోటోను మాత్రం బయిట పెట్టలేదు. అయితే ఇప్పుడు ఆమె తన ఫోటోతో దర్శనమిచ్చింది.
అంతేగాక ఆమెపై వస్తున్న రకరకాల రూమర్స్ కు చెక్ చెప్తున్నట్లుగా ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో ...మీ స్పెక్యులేషన్స్ కు,రూమర్స్ ని లవ్ చేసాను. చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. దయి ఉంచి వాటికి రెస్ట్ ఇవ్వండి అని ట్విట్టర్ లో రాసింది. ప్రస్తుతం ఆమె సిద్దార్ద సరసన చేస్తున్న నందినీ రెడ్డి చిత్రం చేస్తోంది. ఓ హిందీ సూపర్ హిట్ ఆధారంగా బెల్లంకొండ సురేష్ ఈ రొమాంటిక్ కామెడినీ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ షూటింగ్ అనంతరం ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో పాల్గొంటుంది.
ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్ సూర్య' ' రామ్ చరణ్ ' ఎవడు' మణిరత్నం ' కాదల్' గౌతమ్ మీనన్ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది.
ఇక రీసెంట్ గా ఆమె నటించిన ఈగ చిత్రం మంచి హిట్టైవటం ఆమెను ఆనందంలో ముంచేసింది. ఈ చిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా చేసింది. ఇదే నాని సరసన చేస్తున్న ఎటో వెళ్లిపోయింది మనస్సు కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఆమెకు స్కిన్ ఎలర్జీ రావటం వల్లే షూటింగ్ లకు దూరంగా ఉందని ఆమె గతంలో వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











