ఫ్లాప్ ఒప్పుకున్న సుమంత్
సుమంత్ హీరోగా వచ్చిన బోణి చిత్రం అంతటా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రమోషన్ మాత్రం నిర్మాత రమణగోగుల ఉదృతంగా చేస్తున్నారు. అందులో భాగంగా ఓ టీవీ ఛానెల్ లైవ్ షోకు రమణగోగుల, హీరోయిన్ కృతి, సుమంత్ అటెండయ్యారు. ఫోన్ చేసిన అందరూ సినిమా అద్బతంగా ఉంది..ఫలనా సీన్ కేక అంటూ చెప్తూ పొగడసాగారు. అయితే ఓ కాలర్ మాత్రం ధైర్యంగా సినిమా నేను పూర్తిగా చూడలేకపోయాను..సగంలో లేచి వెళ్ళిపోయాను అంటూ నిజాన్ని కక్కాడు. దాంతో వీరి ముఖాలు మాడిపోయాయి. అయితే సుమంత్ మాత్రం చాలా పాజిటివ్ గా చివరకు మీరొక్కరైనా నిజాన్ని చెప్పారు అన్నాడు. అంటే సినిమా పోయిందని సుమంత్ నిజాయితీగా ఒప్పుకున్నట్లుగా..అదీ సంగతి.
sumanth boni kruti ramana gokul flop talk tv channel live show సుమంత్ బోణి ఫ్లాఫ్ టాక్ ప్రమోషన్ రమణగోగుల టీవీ ఛానెల్ లైవ్ షో కృతి


Click it and Unblock the Notifications