Just In
- 4 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 5 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 5 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దగ్గుబాటి మల్టీస్టారర్ పై క్లారిటీ వచ్చేసింది.. దర్శకుడు ఎవరంటే?
టాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుసగా మల్టీస్టారర్ సినిమాలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఒకే ఫ్యామిలీ చెందిన హీరోలు కూడా వెండితెరపై కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నరు. అక్కినేని, మంచు వారు ఇప్పటికే అభిమానులకు మంచి మల్టీస్టారర్ సినిమాలు అందించారు. ఇక త్వరలో మెగా హీరోలు కూడా రెడీ అవుతున్నారు. ఫైనల్ గా దగ్గుబాటి మల్టీస్టారర్ పై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.

వరుసగా ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆ మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు అక్కినేని ఫ్యామిలీ లో కూడా మనం లాంటి సినిమా కాకపోయినా ఎదో మల్టీస్టారర్ కథను తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్పట్లో ఒక టాక్ కూడా వచ్చింది.

రామానాయుడు కోరిక ప్రకారం..
ఇక దగ్గుబాటి ఫ్యామిలీ మొదట నిర్మాణ రంగంలోకి అడుగుపేటైనప్పటికి నిర్మాత రామానాయుడు ఒక కోరికను బలంగా కోరుకున్నారు. వెండితెరపై వెంకటేష్ బాబును అలాగే మానవడు రానాను హీరోలుగా ఓకే ఫ్రేమ్ లో చూడాలని అనుకున్నారు. అప్పట్లో కొన్ని కథలపై కూడా చర్చలు జరిపారు కానీ రానాతో అప్పుడే మల్టీస్టారర్ కథలు చేయడం అంత సేఫ్ కాదని భావించారు.

నిజం చేయాలని సురేష్ బాబు ప్రయత్నాలు
ఇక ఫైనల్ గా ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు తన తండ్రి ఆలోచనను నిజం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే రానా నేషనల్ వైడ్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అయ్యప్పనుమ్ కొశీయుమ్ అనే మల్టీస్టారర్ సినిమాలో కూడా ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. మరోవైపు వెంకీ వరుణ్ తేజ్ తో F3 చేస్తోన్న విషయం తెలిసిందే.

వెంకటేష్, రానా.. వచ్చే ఏడాది కాకపోయినా..
చూస్తుంటే రానా దగ్గుబాటి లైనప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక వచ్చే ఏడాది కాకపోయినా ఆ తరువాత సంవత్సరంలో నైనా దగ్గుబాటి వారి మల్టీస్టారర్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే వెంకటేష్, రానాల కోసం ఒక దర్శకుడు మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు సురేష్ బాబు వివరణ ఇచ్చారు.

దర్శకుడు ఎవరంటే..
ఆ దర్శకుడు మరెవరో కాదు. శతమానం భవతి వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో మంచి క్రేజ్ అందుకున్న సతీష్ వేగేశ్న. ఈ దర్శకుడిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే చక్కటి ఎమోషన్స్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెప్పవచ్చు. ఇక గత ఏడాది వెంకటేష్, నాగ చైతన్యతో కలిసి వెంకీమామ సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. మరి ఈసారి దగ్గుబాటి సినిమా ఏ విధంగా క్లిక్కవుతుందో చూడాలి.