సెట్టయిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబో.. అభిమానుల దెబ్బకు దిగొచ్చిన త్రివిక్రమ్!
ఒక కాంబినేషన్ కి సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినా కూడా సరైన కాంబినేషన్ సెట్టవ్వకపోతే అంత ఈజీగా హైప్ క్రియేట్ అవ్వదు. ఆ లిస్ట్ లో పవర్ స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. ఇకపోతే గత కొంత కాలంగా పవర్ స్టార్ అభిమానులు త్రివిక్రమ్ పై కాస్త అసహనంతోనే ఉన్నారు. ఇక వారి అసహనం డోస్ ఎక్కువవ్వకముందే పవన్ కళ్యాణ్ తో ఎదో ఒక విధంగా సినిమా చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడు.

ఆజ్ఞతవాసి గాయం ఇంకా మానలేదు..
భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా పోతే పోయింది గాని మరో సినిమా నుంచి కాపీ కొట్టేశారని క్లియర్ గా తెలియడంతో అభిమానులు ఆ గాయాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. పైగా ఎలక్షన్స్ కి దగ్గరగా ఉన్న సమయంలో ఆ విధంగా డిజాస్టర్ అవ్వడం అభిమానుల్ని ఎంతగానో కలచివేసింది.

ఆ రెండు సినిమాల తరువాత..
అజ్ఞాతవాసి లాంటి గాయాన్ని మర్చిపోవాలి అంటే తమ హీరోకు మరో మంచి సక్సెస్ ఇవ్వాలని చాలా సార్లు త్రివిక్రమ్ ని కోరారు. అయితే రెండు సినిమాలు చేసిన తరువాత తప్పకుండా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని డిసైడ్ అయిన మాటల మాంత్రికుడు.. అనుకోని విధంగా మళ్ళీ ఎన్టీఆర్ తో రెడీ అవుతున్నాడు. ఇక ఆ సినిమా తరువాత తప్పకుండా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

పవన్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. మరో రెండు ప్రాజెక్టులు పెండింగ్ లిస్ట్ లో ఉన్నాయి. కాబట్టి పవన్ డేట్స్ దొరకడం కష్టమే. అయితే ముందుగా పవర్ స్టార్ ప్రొడక్షన్ ఉపయోగించుకొని రామ్ చరణ్ తోనే ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చేస్తే అభిమానుల్లో కొంత అసహనం తగ్గే ఛాన్స్ ఉంటుంది.
Recommended Video

వెంటనే ఒక సినిమా చేసి ఉంటే..
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ని ఈ విధంగా సెట్ చేసిన త్రివిక్రమ్ హిట్ అందుకోవాలని కథను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఒక బలమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. ఏదేమైనా త్రివిక్రమ్ అజ్ఞాతవాసి తరువాత పవన్ కళ్యాణ్ తో వెంటనే మరో సినిమాను తీసి ఉంటే అభిమానుల్లో ఆనందం మరోలా ఉండేది.


Click it and Unblock the Notifications