twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదంతా 'నచ్చావులే' పుణ్యమే!

    By Staff
    |

    Nachchavule
    అల్లరి రవిబాబు దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించి నచ్చావులే మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.చిన్న సినిమా పెద్ద విజయం కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం పరిశ్రమ వర్గీయులని సైతం ఉత్సాహపరుస్తోంది.ఇక ఈ చిత్రం హిట్ ఇచ్చిన ఉత్సాహంతో ఉషాకిరణ్ సంస్ధవారు వారు శివనాగేశ్వరరావు,శ్రీనివాస రెడ్డి సినిమాలను చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    అలాగే ఆ సంస్ధలో మరికొన్ని కథలు సైతం చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక బయిట పెద్ద సంస్ధలు,నిర్మాతలు సైతం చిన్న చిత్రాల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఇలా మరో రెండు చిన్న చిత్రాలు వచ్చి హిట్టయితే మూసని వదిలి విభిన్నమైన కాన్సెప్ట్స్ తో తెలుగు పరిశ్రమ కళకళ్ళాడుతుందని కొందరు సినీ శ్రేయాభిలాషులు ఆశిస్తున్నారు. ఇక నచ్చావులే చిత్రం చక్కని టీనేజ్ ప్రేమ కథగా ముందుకు వెళ్తూనే,కుటుంబ భాంధవ్యాలు,తండ్రి-పిల్లల మధ్య ఉండవల్సిన రిలేషన్ షిప్ వంటివి చర్చించటంతో ఫ్యామిలీల ఆదరణ నోచుకుంటోది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X