ఫైనాన్సియర్ పై దాడి, బెల్లంకొండపై కేసు నమోదు
ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం...బెల్లకొండ సురేష్ ప్రస్తుతం సిద్ధార్థ-సమంత హీరో హీరోయిన్లుగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'జబర్దస్త్' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్ ప్రదర్శన హక్కుల కోసం సదరు ఫైనాన్సియర్ బెల్లంకొండకు రూ. 25 లక్షలు చెల్లించాడు. అయితే ఏమైందో తెలియదు కానీ అగ్రిమెంటు విషయంలో ఇరు వురి మధ్య విబేధాలు వచ్చాయి. ఈ క్రమంలోనే తీవ్రంగా వాదులాడుకున్నారని, బెల్లంకొండ కోపం ఆపుకోలేక అతనిపై దాడి చేసాడని తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్‌పై ఇలాంటి కేసులు నమోదు కావడం, ఆరోపణలు రావడం ఇది తొలి సారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో బెల్లంకొండ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆ మధ్య కందిరీగ దర్శకుడిపై బెల్లంకొండ చేయి చేసుకున్నారు.
జబర్దస్త్ సినిమా వివరాల్లోకి వెళితే...
సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగు ఇప్పటికే పూర్తయింది. జనవరి 27న హైదరాబాద్ లో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతం : థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి .మహేంద్రబాబు, నిర్మాత : బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బి.వి.నందినిరెడ్డి.


Click it and Unblock the Notifications












