అత్తతో ఐశ్వర్యరాయ్ జగడం, స్పందించిన అభిషేక్
ముంబై: అందాల తార ఐశ్వర్యరాయ్, ఆమె అత్త జయా బచ్చన్ మధ్య అస్సలు పొసగడం లేదని బాలీవుడ్లో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అత్తపోరు పడలేక ఐశ్వర్యరాయ్ వేరు కాపురానికి సిద్ధమైందంటూ పుకార్లు షికార్లు చేసాయి. బచ్చన్ కుటుంబ వ్యవహారం కావడంతో ఈ విషయం మీడియాలోనూ చర్చనీయాంశం అయింది.
దీంతో ఈ పరిణామాలపై పలువురు అభిమానులు అభిషేక్ బచ్చన్ సోషల్ నెట్వర్కింగులో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలపై అభిషేక్ బచ్చన్ ట్విట్టర్లో స్పందిస్తూ...అవన్నీ 'పనికి మాలిన వార్తలు' అంటూ కొట్టి పారేసారు. ఐశ్వర్యరాయ్ కూడా ఈ వార్తలపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

అభిషేక్ బచ్చన్ వివరణ ఇవ్వడంతో ఈ వివాదాస్పద వార్తల ఘట్టానికి తెర పడ్డట్లు అయింది. తమ ఫ్యామిలీ మ్యాటర్ గురించి మీడియాలో ఇంత చర్చ జరుగుతున్నా ఎప్పుడూ సోషల్ నెట్వర్కింగులో యాక్టివ్‌గా ఉండే అమితాబ్ బచ్చన్ అసలు స్పందించక పోవడం గమనార్హం.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వివాహం 2007 జరిగిన సంగతి తెలిసిందే. వీరి కాపురానికి గుర్తుగా ఇటీవల ఆరాద్య జన్మించింది. తల్లయిన నాటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఐశ్వర్యరాయ్ త్వరలో మళ్లీ రీ ఎంట్రీకి రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











