అశృ నయనాల మధ్య విజయ నిర్మల అంతిమయాత్ర, ముగిసిన దహన సంస్కారాలు
సినీ నటి, దర్శకురాలు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టేసింది. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున ఆమె గుండెపోటు కారణంగా మరణించారనే వార్త విని షాకయ్యారు జనం. ఆమె మృతి పట్ల పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు తమ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
అయితే విజయ నిర్మల భౌతిక కాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసంలో ఉంచి.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభించారు. నానక్ రామ్ గూడ నుంచి ప్రత్యేక వాహనంలో ప్రారంభమైన విజయ నిర్మల అంతిమ యాత్రలో పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. కొద్ది సేపటి క్రితం ఆమె అంతిమయాత్ర ముగిసింది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోని ఆమె ఫామ్ హౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు పూర్తి చేశారు. విజయనిర్మల కొడుకు నరేష్ చేతుల మీదుగా దహన సంస్కారాలు జరిగాయి. ఎన్నటికీ మరచిపోలేని తార విజయ నిర్మలను తలచుకుంటూ కృష్ణ, నరేష్ బోరున విలపించారు. నేటితో బౌతికంగా ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది విజయనిర్మల.
200 లకు పైగా చిత్రాల్లో నటించి హీరోయిన్ గా, 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గొప్ప దర్శకురాలిగా కీర్తి గడించింది విజయనిర్మల. ఆమె జీవిత ప్రయాణంలో ఎన్నో మరపురాని ఘట్టాలు ఉన్నాయి. 2002 సంవత్సరం ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా రికార్డు సృష్టించింది విజయనిర్మల.


Click it and Unblock the Notifications











