దాసరిపై సీబీ‘ఐ’ : టాలీవుడ్లో ఆందోళన

ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా, చిన్న నిర్మాతలకు, టీవీ ఆర్టిస్టులకు బలమైన అండగా నిలుస్తూ.......పెద్ద నిర్మాతల వర్గానికి, డబ్బింగ్ సీరియల్స్‌తో తెలుగు టీవీ ఆర్టిస్టుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్న టీవీ ఛానల్స్ యాజమాన్యాలకు కొరకరాని కొయ్యగా మారారు దాసరి. ఇటీవల కాలంలో పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి వద్దకు వెళ్లడం సాంప్రదాయంగా మారింది.
ఈ నేపథ్యంలో తమకు పెద్ద దిక్కువగా ఉన్న దాసరి బొగ్గు కుంభకోణం కేసులో చిక్కుల్లో పడటం ఆయన వర్గానికి చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. ఇదు అదునుగా దాసరి వ్యతిరేక వర్గం....చురుకుగా పావులు కలిపే అవకాశాలు ఉన్నాయని, ఆ వర్గానికి ఓ కేంద్ర మంత్రి అండ కూడా ఉండటంతో ఇండస్ట్రీలో కొన్ని పరిస్థితులు తారుమారయ్యే చాన్సూ లేకపోలేదని టాక్.
ప్రస్తుతం దాసరి నారాయణరావును ప్రశ్నిస్తున్న సీబీఐ తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? ఎఫ్ఐఆర్‌లో దాసరి పేరు చేర్చిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతోంది? చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కయిన దాసరి ఒకవేళ అరెస్టయితే.......తెలుగు ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు చేటు చేసుకుంటాయా? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.


Click it and Unblock the Notifications











