చేతి దూల: సల్మాన్ ఖాన్‌పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అతని అంగరక్షకులపై కాన్పూర్ లోని కకాడియో పోలీస్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉమేంద్ర భరత్ పై దాడి చేసిన సంఘటనలో ఈ ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కొందరు ఇటీవల సల్మాన్ ఖాన్ వాహనాన్ని చుట్టుముట్టి గాంధీ టోపీ పెట్టుకోవాలని, అవినీతి వ్యతిరేక పోరాటంలో చేరాలని కోరడంతో ఆయన అంగరక్షకులు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.
సల్మాన్ గతంలో మూగజీవాలను వేటాడిన కేసులో కోర్టు చిక్కులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్లీ సల్మాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో బాలీవుడ్ లో మళ్లీ చర్చనీయాంశం అయింది. దాడి కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి అతను కోర్టుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు కొందరు న్యాయ నిపుణులు.


Click it and Unblock the Notifications











