రూ. 37 లక్షలు ఫ్రాడ్: హీరోయిన్ సోనాక్షి సిన్హా మీద కేసు నమోదు
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, మరో ఏడుగురు వ్యక్తుల మీద రూ. 37 లక్షల ఫ్రాడ్(మోసం) కేసు నమోదైంది. ఈ మేరకు మోరాదాబాద్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రమోద్ శర్మ అనే ఈవెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
ఇండియా ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్స్ పేరుతో సెప్టెంబర్ 30న ఢిల్లీలో ఓ అవార్డ్ షో నిర్వహించారు. ఈ వేడుకలో పెర్ఫార్మ్ చేసేందుకుగాను సోనాక్షితో రూ. 2.8.17 లక్షల డీల్ కుదిరింది. ఈ మొత్తం నాలుగు వాయిదాల్లో ఎలక్ట్రానిక్ సిస్టం ద్వారా జూన్ నెలలో ట్రాన్ఫర్ చేశారు. దీంతో పాటు సోనాక్షి సిన్హా అకామిడేషన్, ట్రావెలింగ్, ఆమెతో అసోసియేట్ అయిన రెండు సంస్థలకు కమీషన్ రూపంలో మరో రూ. 9 లక్షలు వెచ్చించారు.

డుమ్మా కొట్టిన సోనాక్షి, భారీ నష్టం
అయితే డబ్బు తీసుకున్న సోనాక్షి ఈ కార్యక్రమానికి రాకుండా డుమ్మా కొట్టింది. దీని వల్ల తమకు చాలా నష్టం జరుగడంతో పాటు అప్రతిష్టపాలు కావాల్సి వచ్చిందని ప్రమోద్ శర్మ ఆరోపించారు. ఆమె ఈ వేడుకకు రాక పోవడంతో ఆగ్రహానికి గురైన ప్రేక్షకులు అవార్డ్ షో వేదికను సైతం డ్యామేజ్ చేశారని తెలిపారు.

ఫ్లైట్ టికెట్స్ కూడా కేన్సిల్
పేమెంట్ తీసుకన్న తర్వాత సోనాక్షి సిన్హా ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేసింది. అయితే షో జరిగే రోజు ఆమె కోసం బుక్ చేసిన 10 గంటల ఫ్లైట్ క్యాన్సిల్ చేసిందని, 3 గంటలకు మరో ఫ్లైట్‌కు టికెట్స్ బుక్ చేసినా ఆమె రాలేదని తెలిపారు.

ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ
ఈ సంఘటనపై మొరాదాబాద్ ఖాట‌్‌ఘర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

సినిమాలు
సినిమాల విషయానికొస్తే సోనాక్షి ప్రస్తుతం... కరణ్ జోహార్ మూవీ ‘కలంక్' చిత్రంలో నటిస్తోంది. చిత్రంలో అలియా భట్, వరుణ్ ధావన్, మాధురి దీక్షిత్, సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు. దీంతో పాటు అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్' చిత్రంలో కూడా ఎంపికైంది.


Click it and Unblock the Notifications











