‘డర్టీ’ విద్యాబాలన్‌పై HYDలో కేసు నమోదు
డర్టీ పిక్చర్‌లో అసభ్యంగా నటించిందని హీరోయిన్ విద్యాబాలన్‌పై అజాద్ అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో కేసు నమోదు చేయాలని పిటీషన్ వేశాడు. దీనికి స్పందించిన కోర్టు హీరోయిన్ విద్యాబాలన్‌పై, డర్టీ పిక్చర్ నిర్మాతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నల్లకుంట పోలీసులను ఆదేశించింది. సినిమాకు సంబంధించిన ట్రయిలర్స్, వాల్ పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయని ఆజాద్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. మహిళా సంఘాలు కూడా డర్టీ పిక్చర్ వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధం అవుతున్నాయి.
సిల్మ్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన 'ద డర్టీ పిక్చర్'లో స్మిత పాత్రను విద్యా బాలన్ పోషించగా, మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించారు. ఎక్తా కపూర్, శోభాకపూర్ లు నిర్మాతలు. స్మిత జన్మిదినం అయిన డిసెంబర్ 2ను పుస్కరించుకుని ఈ సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకోలుతోంది. ఈ నేపథ్యంలో సినిమా కోర్టు చిక్కుల్లో ఇరుక్కోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











