»   » నగ్న ఫొటో పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డ హీరో

నగ్న ఫొటో పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిత్యం సోషల్ మీడియాలో వివాదాస్పద ట్వీట్లతో చిక్కుల్లో పడే బాలీవుడ్ యాక్టర్ రిషీ కపూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి అతని ట్వీట్ మరింత వివాదాలకు దారితీయడంతో పోలీసులు రిషీ కపూర్‌పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే రిషి కపూర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పిల్లవాడి న్యూడ్ ఫొటో పోస్టు చేశారు.

జై హో ఫౌండేషన్

జై హో ఫౌండేషన్

ఈ దృశ్యంలో ఆ పిల్లవాడు దుస్తులేమీ ధరించకుండా కేవలం హెడ్ ఫోన్స్ పెట్టుకుని కనిపిస్తాడు. ముంబైకి చెందిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ‘జై హో ఫౌండేషన్' జనరల్ సెక్రటరీ, అడ్వికేట్ ఆదిల్ ఖత్రీ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిషీ కపూర్ చేసిన పోస్టు అభ్యంతరకరమైనదని ఆయన ఆరోపించారు.

ఈ ఫోటోను తొలగించారు

ఈ ఫోటోను తొలగించారు

ఖత్రీ మీడియాతో మాట్లాడుతూ తాను ముంబై పోలీసు కమిషనర్, ముంబై సైబర్ సెల్, మహిళా శిశు సంక్షేమశాఖలకు రిషీకపూర్ అభ్యంతరకర పోస్టుపై ఫిర్యాదు చేశానన్నారు. రిషీ కపూర్ ఒక చిన్నారి నగ్న, పోర్న్‌గ్రాఫిక్ ఇమేజ్‌ను షేర్ చేశారని తెలిపారు. కాగా రిషీ కపూర్‌ ట్విట్టర్ ఖాతాకు అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న నేపధ్యంలో వారంతా ఈ ఫొటోను షేర్‌చేసుకున్నారు. అయితే ఈ పోస్టు వివాదాస్పదం కావడంతో రిషీ కపూర్ ఈ ఫోటోను తన ఖాతా నుంచి తొలగించారు.

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును రూ.30వేలతో కొన్నానని

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును రూ.30వేలతో కొన్నానని

రిషీ కపూర్ కి ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు గతంలోనూ ఫిలిం ఫేర్ అవార్డు పై సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడు. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును రూ.30వేలతో కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని 'ఇండియా టుడే' ఛానల్‌ ఇంటర్వ్యూలో 1973లో తాను హీరోగా పరిచయమైన చిత్రం 'బాబీ'. ఈ సినిమా విషయం లోనే రిషీకపూర్ ఒక విషయాన్ని చెప్పాడు.

1974లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు

1974లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు

ఈ చిత్రంలో రిషీ నటనకుగాను 1974లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు. ఈ అవార్డు తన ప్రతిభకు వచ్చింది కాదని రూ.30 వేలతో కొన్నానని చెప్పారు. ఈ నటుడు 'ఖుల్లం ఖుల్లా'పేరు ఆత్మకథను రాశారు. దాన్ని మంగళవారం ముంబాయిలో విడుదల చేశారు.

ఇండియా టుడే ఛానల్‌

ఇండియా టుడే ఛానల్‌

దీనికి ముందు ఇండియా టుడే ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పట్లో రూ.30వేలకు ఈ అవార్డు కొన్నానని తర్వాత తాను చేసిన పనికి సిగ్గేసిందని చెప్పారు. అప్పుడు తాను యువకుడినని, చేతిలో బాగా డబ్బులు ఉండేవని తెలిపారు. ఆ తర్వాత మరెప్పుడూ అలాంటి పని చేయలేదని పేర్కొన్నారు. ఇప్పుడైతే రూ. 6.19లక్షలు చెల్లించాల్సి వస్తోందని కూడా వ్యాఖ్యానించారు.

English summary
A non-profit organisation Jai Ho Foundation has approached the Cyber Police regarding the 'offensive' picture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu