గాయకుడు జేసుదాసుపై కేసు నమోదు

By Srikanya

తిరువనంతపురం: మహిళలు జీన్స్‌ వేసుకోవడాన్ని తప్పు పట్టిన ప్రముఖ గాయకుడు జేసుదాస్‌పై కేరళలోని తిరువనంతపురం పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గురువారం గాంధీ జయంతి రోజున ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళలు జీన్స్‌ వేసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తిరువనంతపురంలో మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన మార్చ్‌ నిర్వహించారు. గాయకుడిగా ఆయనను ఎంతో గౌరవిస్తున్నామని, కానీ మహిళల వ్యతిరేక వ్యాఖ్యలు ఆయన నుంచి రావడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే... మహిళలు జీన్స్‌ వస్త్రాలు ధరించటంపై ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు జీన్స్‌ వస్త్రాలు ధరించి ఇతరులకు ఇబ్బంది కలిగించరాదని, నిండుగా దుస్తులు ధరించాలని సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నిరాడంబరత, స్నేహస్వభావం స్త్రీల గొప్ప గుణాలుగా భావించే భారతీయ సంస్కృతికి జీన్స్‌ వంటివి ధరించటం విరుద్ధమని వ్యాఖ్యానించారు.

FIR filed against singer Yesudas for his remarks on women wearing jeans

సినిమాల విషయానికి వస్తే...సంగీత ప్రియుల హృదయాలను మెలితిప్పి.. శోక పాటలతో కన్నీళ్లు తెప్పించగల స్వరం ఏసుదాస్‌ది. తనదైన బాణీతో తరతరాలుగా అభిమానులను సొంతం చేసుకున్నారాయన. గత కొంత కాలంగా సంప్రదాయ సంగీతానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన ఆయన.. ఇప్పుడు మళ్లీ సినిమాపై దృష్టి పెట్టారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న 'కత్తి' చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం రానున్న 18వ తేదీన చెన్నైలో జరుగనుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ఓ ముఖ్యమైన పాటను ఏసుదాస్‌చే పాడించారు అనిరుధ్‌. నాటి ప్రేక్షకులతోపాటు, నేటి ట్రెండ్‌ కూడా ఇష్టపడేలా ఈ పాటను రూపొందించినట్లు సమాచారం.

'కొలవెరి..'తో ప్రపంచానికి పరిచయమైన అనిరుధ్‌.. ప్రారంభం నుంచే సీనియర్‌ గాయకులతో తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల 'వేలయిల్లా పట్టదారి' చిత్రంలో ఓ పాటను అలనాటి గాయనీమణి ఎస్‌.జానకితో పాడించారాయన. ఇప్పుడు మళ్లీ ఏసుదాస్‌ను పిలిపించి.. తన అభిమానాన్ని చాటుకున్నారు అనిరుధ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X