»   » సోను నిగమ్‌పై ఎఫ్ఐఆర్, పత్వా: గుండు కొట్టి చెప్పుల దండేస్తే 10 లక్షలు!

సోను నిగమ్‌పై ఎఫ్ఐఆర్, పత్వా: గుండు కొట్టి చెప్పుల దండేస్తే 10 లక్షలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మీద మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మతాలకు సంబంధించి తన ట్విట్టర్లో వివాదాస్పద కామెంట్స్ చేయడంతో ఆయనపై ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.

  సోనూ నిగమ్ పై కోల్ కతాకు చెందిన ఓ ముస్లిం మతగురువు ఫత్వా ప్రకటించారు. ఆయనకు గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి ఊరేగించిన వారికి రూ. 10 లక్షలు బహుమతి ఇస్తానని పశ్చిమ బెంగాల్‌ మైనారిటీ యునైటెడ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సయిద్‌ షా అతిఫ్‌ అలీ ఆల్‌ ఖ్వాద్రి ఫత్వా జారీ చేశారు.

  భారత దేశంలో బలవంతపు మతత్వం ఎప్పుడూ ముగుస్తుందో... ఇదో గుండా గిరి లాంటిదే అంటూ సోనూ నిగమ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. సోనూ నిగమ్ ఇలా మతాలపై విరుచుకుపడటానికి కారణం.... మసీదు నుండి ఉదయం మైకులో వినిపించే ఆజాన్(ప్రార్థన). ఆజాన్ శబ్దానికి సోనూ నిగమ్ నిద్రాభంగానికి గురి కావడంతో వెంటనే ట్విట్టర్లో తన కోపాన్ని వెల్లగక్కాడు.

  సోను నిగమ్

  సోను నిగమ్

  అయితే ట్విట్టర్లో సోను నిగమ్ చేసిన కామెంట్స్ కు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు సోను నిగమ్ స్పష్టం చేసారు.

  నేను ముస్లింను కాదు..

  నేను ముస్లింను కాదు..

  ఆజాన్ శబ్దంతో నిద్రలేని సోనూ నిగమ్... ‘అందరినీ దేవుడు చల్లగా చూడాలి. నేను ముస్లింని కాను. అయినా ఉదయాన్నే వినిపించే ఆజాన్‌ పిలుపుతో నిద్రలేవాలి. భారతదేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడు ముగుస్తుందో... అంటూ అంటూ ట్వీట్ చేసాడు.

  అప్పుడు కరెంటు లేదు.

  అప్పుడు కరెంటు లేదు.

  ఇస్లాం మతాన్ని మహ్మద్ ప్రవక్త స్థాపించినపుడు కరెంటు లేదు. అప్పట్లో ఇలా మైకులో ఆజాన్ వినిపించడం లాంటివి ఏమీ లేవు. ఎడిసన్‌ బల్బును కనిపెట్టిన తర్వాతే గోల ఎందుకు? అంటూ సోనూ నిగమ్ ట్వీట్ చేసారు.

  మతాన్ని

  మతాన్ని

  అనుసరించని వారిని ఉదయాన్నే ధ్వనులతో నిద్రలేపే ఆలయాలు, గురుద్వారాలను నేను నమ్మను..... మరో వివాదాస్పద ట్వీట్ చేసాడు సోనూ నిగమ్.

  గుండాగిరి

  గుండాగిరి

  ఇలా వారికి మతానికి సంబంధం లేని వారిని... ఇలా శబ్దాలతో బలవంతంగా ఎవరు నిద్రలేపినా ఇది గుండా గిరి అవుతుంది.... అని సోనూ నిగమ్ వ్యాఖ్యానించారు.

  English summary
  Singer Sonu Nigam is making headlines over his controversial remarks on the use of loudspeakers at religious places. Recently, Sonu Nigam ranted about being woken up by morning Azaan in a series of tweets. He said, ”When will this forced religiousness end in India.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more