Veera Simha Reddy థియేటర్‌లో అగ్నిప్రమాదం.. ముందే హెచ్చరించిన థమన్.. ఎందుకిలా జరిగిందంటే!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన స్థాయిలో హవాను చూపించడంతో పాటు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన 'అఖండ' తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోన్న ఆయన.. తాజాగా 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ప్రదర్శితం అవుతోన్న థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

 బాలకృష్ణ మరో మాస్ ట్రీట్‌

బాలకృష్ణ మరో మాస్ ట్రీట్‌

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రమే 'వీర సింహా రెడ్డి'. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి మ్యూజిక్‌ను అందించాడు.

భారీ స్థాయిలో వచ్చేసింది

భారీ స్థాయిలో వచ్చేసింది


క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ నందమూరి అభిమానులతో మోత మోగుతూ హౌస్‌ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి.

వీర సింహా రెడ్డికి టాక్ ఇలా

వీర సింహా రెడ్డికి టాక్ ఇలా


ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీకి సంబంధించి ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కొన్ని షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కుతోంది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయితే, టాక్ విషయంలో మాత్రం కొందరు ఈ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు.

ఓపెనింగ్స్ భారీగా అంటూ

ఓపెనింగ్స్ భారీగా అంటూ


నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఓవరాల్‌గా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి అస్సలు సంబంధమే లేనట్లుగా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీ స్థాయిలో వస్తోంది. దీంతో ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే బుకింగ్స్ అయ్యాయి. ఫలితంగా ఈ చిత్రం ఓపెనింగ్స్‌తో రికార్డులు కొడుతుందని అంటున్నారు.

 థియేటర్‌లో యాక్సిడెంట్

థియేటర్‌లో యాక్సిడెంట్


పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే దక్కుతోంది. ఫలితంగా థియేటర్లు అన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. అలాంటిది తాజాగా విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం టౌన్‌లో ఉన్న ఓ థియేటర్‌లో 'వీర సింహా రెడ్డి' సినిమా ప్రదర్శితం అవుతుండగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదానికి కారణం అదే

ప్రమాదానికి కారణం అదే

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రదర్శితం అవుతుండగా.. థియేటర్‌లోని సౌండ్ సిస్టమ్‌లో సమస్య వచ్చిందట. దీంతో హీట్ ఎక్కువై తెర వెనకాల ఉన్న స్పీకర్ల నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన యాజమాన్యం సినిమాను నిలిపివేసింది. దీంతో ప్రేక్షకులు కూడా అక్కడి నుంచి సురక్షితంగా బయటకు వచ్చేశారు.

హెచ్చరించిన ఎస్ థమన్


మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మధ్య హై ఓల్టేజ్ బ్యాగ్రౌండ్ స్కోర్లు ఇస్తున్నాడు. గతంలో 'అఖండ' సినిమాకు చాలా థియేటర్లలో ఇలాంటి సమస్యలే వచ్చాయి. దీంతో 'వీర సింహా రెడ్డి' సినిమాకు థియేటర్ల వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని అతడు హెచ్చరించాడు. అయినప్పటికీ సబ్బవరంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X