చిరంజీవి సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్నది. హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో 2022లో సైరా, ఆచార్య సినిమాల కోసం వేసిన సెట్‌‌కు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొన్నాయి. పాత సెట్‌కు మంటలు అంటుకొని.. భారీగా ఎగిసిపడంతో అగ్నిమాపక దళానికి స్థానికులు సమాచారం అందించారు.

దాంతో సకాలంలో స్పందించిన వట్టినాగులపల్లి ఫైర్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. స్థానికులు కూడా సహాయం చేయడంతో ఫైర్ యూనిట్‌ మంటల్ని త్వరగా అదుపులోకి తెచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకొన్నారు.

Fire accident in Mega Star Chiranjeevi Movie sets at Kokapet of Hyderabad

ప్రమాదస్థలానికి స్థానిక పోలీసులు వెళ్లి కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో కేసును పరిశీలిస్తున్నారు. ప్రమాద వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సెట్ నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X