Don't Miss!
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అన్నపూర్ణ స్టూడియోలో ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన మనం సెట్.. విషాదంలో
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ప్రముఖ అన్నపూర్ణ స్టూడియో అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినదనే విషయం తెలిసిందే. ప్రమాద స్థలికి నాగార్జున చేరుకొని సహాయక చర్యల్లోపాల్గొన్నారు. ఇతరులు లోనికి రావొద్దని సూచించారు.
సెట్లు పూర్తిగా ధ్వంసం
ప్రాథమిక సమాచారం ప్రకారం.. అన్నపూర్ణ స్టూడియో రెండు సెట్లకు మంటలు అంటుకొన్నట్టు తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఓ సెట్ పూర్తిగా ధ్వంసమైనట్టు సమాచారం. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు.
Recommended Video
ఆస్తి నష్టంపై వివరాలు..
ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది నీటితో మంటలను ఆర్పేందుకు స్టూడియో సిబ్బంది యత్నించారు. అగ్నిమాపక సిబ్బంది స్టూడియోకు చేరుకొని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా వివరాలు తెలియరాలేదు.
మనం సెట్ దగ్ధం
‘అన్నపూర్ణ' సినీ స్టూడియోలోని ఓ సెట్లో చెలరేగిన మంటలు కొద్ది సేపటికే భారీగా విస్తరించడంతో సమీపంలో ఉన్న ‘మనం' సినిమా సెట్ కూడా అగ్నికి ఆహుతైంది. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాలు కలిసి నటించిన ‘మనం' చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
విషాదంలో అక్కినేని కుటుంబం
అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా అయిన ‘మనం' అక్కినేని ఫ్యామిలీ సినిమాలకు నిండుదనం తెచ్చిపెట్టింది. దీంతో ఆ సినిమా సెట్‌ను అప్పటినుంచి అలాగే ఉంచారు. అక్కినేని ఫ్యామిలీ ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ‘మనం' సెట్ ఇలా అగ్నికి ఆహుతి కావడంతో అక్కినేని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
స్టూడియో లోపలికి రావొద్దు..
అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే స్టుడియోకు చేరుకున్నారు. ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మీడియాను, ఇతరులను లోపలికి రావొద్దంటూ నాగార్జున కోరారు. టీవీలో అగ్నిప్రమాదం వార్త చూసిన పలువురు సినీ ప్రముఖులు స్టుడియోకు చేరుకుంటున్నారు.
షాట్ సర్య్కూట్ వల్లే
ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి మీడియాను గానీ, మరెవరినీ ఆనుమతించడంలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.