చిరంజీవి ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం: కాలిబూడిదైన ‘సైరా నరసింహారెడ్డి’ సెట్!

Recommended Video

కాలిబూడిదైన ‘సైరా నరసింహారెడ్డి’ సెట్! || Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి' మూవీ సెట్లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సెట్ మొత్తం కాలి బూడిదైంది. అదృష్ట వశాత్తూ అక్కడ ఎవరూ లేక పోవడంతో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు.

మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఫాం హౌస్‌లో ఈ సెట్ వేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట శివారులో ఇది ఉంది. తెల్లవారుజామున దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు.

భారీగా ఆస్తి నష్టం

భారీగా ఆస్తి నష్టం

‘సైరా నరసింహారెడ్డి' సెట్లో ప్రస్తుతం ఎలాంటి షూటింగ్ జరుగడం లేదు. మనుషులు కూడా ఎవరూ లేరు. అందుకే మంటలు ఎగసిపడే వరకు ఎవరూ కనిపెట్టలేక పోయారు. అయితే ఆస్తి నష్టం భారీగానే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి?

అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి?

అయితే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటనేది తెలియడం లేదు. తెల్లవారు ఝామున కాబట్టి షాట్ సర్వ్యూట్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

సైరా సెట్లో వరుస ప్రమాదాలు

సైరా సెట్లో వరుస ప్రమాదాలు

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సైరా సెట్ కూడా కొన్ని రోజుల క్రితం కాలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమిలో సెట్ వేయడంతో అనుమతి లేదనే కారణంతో అధికారులు కూల్చి వేయడం అప్పట్లో సెన్సేషన్ అయింది.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

చివరి దశలో షూటింగ్

చివరి దశలో షూటింగ్

‘సైరా' టీం మేజర్ టాకీ పార్ట్ ఇటీవలే పూర్తి చేశారు. అయితే సినిమాలో పూర్తి చేయాలని కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉండటంతో అందుకోసం షూటింగ్ షెడ్యూల్ పొడగించక తప్పలేదు. ప్యాచ్ వర్క్ షూటింగ్ మైలారం విలేజ్, కోకాపేట్, వికారాబాద్ అడవుల్లో ప్లాన్ చేశారు. మరికొన్ని రోజుల్లో టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తి కాబోతోంది.

దసరా రిలీజ్

దసరా రిలీజ్

‘సైరా' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపుగా చివరి దశకు చేరుకోవడంతో ఆ తర్వాత జరిగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన భాగానికి సంబంధించి ఆల్రెడీ విజువల్ ఓఫెక్ట్స్, ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X