భారీ పేలుడు: రవితేజ ‘పవర్’ షూటింగులో అగ్నిప్రమాదం?

By Bojja Kumar

హైదరాబాద్: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న 'పవర్' షూటింగ్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. పట్టాయా సమీపంలోని అడవిలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అగ్నిప్రమాదం సంభవించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగులో ఉపయోగించే పేలుడు పదార్థాల మూలంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా అడవిలో మంటలు అంటుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని తెలుస్తోంది.

Fire accident in Ravi Teja's Power movie shooting

రాకలైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'పవర్'. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. రెజీనా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి హండ్రెడ్ పర్సంట్ సూట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రయోగాలకు వీలైనంత దూరంగా ఉంటూ...నిర్మాతలకు నాలుగు డబ్బులు తెచ్చే సినిమాలు చేస్తున్నారు రవితేజ. 'పవర్' కూడా ఆ కోవకు చెందినదే.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖా వాణి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).]

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X