హీరోయిన్ ఐశ్వర్యరాయ్ అపార్టుమెంట్లో అగ్నిప్రమాదం (ఫోటోస్)
ముంబైలోని బాంద్రాలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌కు చెందిన అపార్టుమెంటులో అగ్నిప్రమాదం సంభవించింది.
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి చెందిన హై రైజ్ అపార్టుమెంటులో మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముంబై మహానగరంలోకి బాంద్రాలో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. సంఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు.
అదృష్టవశాత్తు ఈ అపార్టుమెంటులో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం నివాసం ఉండటం లేదు. గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ఇదే బిల్డింగులో నివాసం ఉండేవారు. సచిన్ టెండూల్కర్ 10వ అంతస్థులో, ఐశ్వర్యరాయ్ 12వ అంతస్తులో నివాసం ఉండేవారు.
ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ కూడా ఇదే అపార్టుమెంటులోని 2వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ తల్లి 12వ అంతస్తులో నివసిస్తున్నారని, 10వ అంతస్తులో సచిన్ టెండూల్కర్ బంధువులు ఉంటున్నారని, ఈ అపార్టుమెంటులో మొత్తం 16 ఫ్లోర్లు ఉన్నాయని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్
ఐశర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌కు చెందిన హై రైజ్ అపార్టుమెంట్ అగ్నిప్రమాదానికి గురైంది.

ఫైర్ అంబులెన్స్
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళం, ఇతర సివిల్ సర్విసెస్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు.

12వ అంతస్తులో ఐశ్వర్యరాయ్ ప్లాట్
ఈ అపార్టుమెంటులో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కు చెందిన ఫ్లాటు 12వ అంతస్తులో ఉంది.
సచిన్ టెండూల్కర్
ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో ఈ అపార్టుమెంటులోని 10వ అంతస్థులో నివాసం ఉండేవారు.
ప్రహ్లాద్ కక్కర్
ప్రముఖ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ ఈ అపార్టుమెంటులోని 2వ అంతస్తులో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











