అన్నపూర్ణా స్డూడియోస్‌లో అగ్ని ప్రమాదం...కాలిపోయిన సెట్స్
ఒక్కసారిగా స్టూడియోనుంచి మంటలు ఎగసిపడడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు కబురుచేశారు. రెండు ఫైరింజన్లు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బ్లాక్ బీలో ఒక ఫ్లోర్ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. గతంలోనూ 'డమరుకం' షూటింగ్ సెట్స్(అన్నపూర్ణ స్టూడియో)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సినిమా కోసం నిర్మించిన భారీ సెట్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఇక ఈ అగ్నిప్రమాదంలో..రంగం అనే టీవీ పోగ్రామ్ కు చెందిన సెట్స్ దగ్దమైనట్లు తెలుస్తోందియ మిగతా సెట్స్ కు ఏమీ జరగలేదు. అన్నపూర్ణలో అగ్నిప్రమాదం అనగానే...ఏ సినిమా సెట్టింగ్ అని అందరూ కంగారు పడ్డారు. మా టీవీలో వచ్చే రంగంకు చెందిన సెట్స్ ఇవి. సెట్టింగ్స్ కాలిపోవటం అనే నష్టం తప్ప...మరే విధమైన ప్రాణహాని కలగకపోవటంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications












